విశాఖ సదస్సు వేదికగా ఏపీలో పెట్టుబడుల వర్షం

Last Updated : Feb 26, 2018, 12:31 PM IST
విశాఖ సదస్సు వేదికగా ఏపీలో పెట్టుబడుల వర్షం

విశాఖలో జరగుతున్న ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల్లో ఏపీ సర్కాత్ తో ప్రముఖ కంపెనీలు 2 లక్షల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తంగా శని, ఆదివారాల్లో 2 లక్షల 18 వేల 814 కోట్లు విలువైన ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. శనివారం 44 వేల 246 కోట్లు విలువైన ఒప్పందాలు 79 ఒప్పందాలు జరిగాయి. ఆదివారం లక్షా 74 వేల 569 కోట్ల విలువైన 285 ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడులకు ఆకర్షించడంలో ఇంధన రంగం ముందంజలో ఉంది. ఈ రంగంలో ఏకంగా లక్షా 11 వేల 921 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇంధన రంగంతో పాటు వైమానిన, రక్షణ, జౌళి, ఆహార శుద్ధి, ఆరోగ్యం,ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి.

రిలయన్స్‌తో రూ.55 వేల కోట్ల ఒప్పందాలు
పెట్టుబడులు పెట్టిన వారిలో రిలయర్స్ సంస్థ ముందంజలో ఉంది. ఈ సంస్థ ఏకంగా రూ. 55 వేల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకోవడం విశేషం. తిరుపతిలో ఎలక్ట్రానిక్ పార్క్, అమరావతిలో క్యాంపస్, కృష్ణ- గోదావరి బేసిన్‌లో మూడు భారీ ప్రాజెక్టులకు చేపట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది.

Trending News