BJP workers murder: ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ

జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు బీజేపి కార్య‌క‌ర్త‌ల‌పై కాల్పులు ( Terror attacks ) జ‌రిపి పొట్టనబెట్టుకున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఖండించారు.

Last Updated : Oct 30, 2020, 08:44 AM IST
BJP workers murder: ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi condemns killing of BJP workers in J&K’s Kulgam: న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు బీజేపి కార్య‌క‌ర్త‌ల‌పై కాల్పులు ( Terror attacks ) జ‌రిపి పొట్టనబెట్టుకున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఖండించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. మా ముగ్గురు యువ కార్యకర్తలను హత్య చేయడాన్ని తాను ఖండిస్తున్నానని మోదీ చెప్పారు. వారు జమ్మూ కాశ్మీర్ అద్భుతమైన పని చేస్తున్న ప్రకాశవంతమైన యువకులని..ఈ దు:ఖ: సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబాలతో ఉన్నాయి.. అంటూ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. ఈ హత్యలపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీజేపీ నేతలు ఖండించారు.  Also read: BJP workers murder: బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి

జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లాలోని ఖాజిగుండ్ ప్రాంతంలోని వైకె పొరా గ్రామంలో గురువారం రాత్రి 8.20 గంటలకు బీజేపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై ఉగ్రవాదులు (3 BJP workers murder) కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాదుల కాల్పుల్లో కుల్గాం జిల్లా బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిధాహుసేన్ యాటూ, ఉమర్ రషీద్ బీగ్, ఉమర్ రంజాన్ హజామ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు. అయితే ఈ దాడి అనంతరం భద్రతాదళాలు, పోలీసులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. 

 Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News