RJ Surya Caste issue: సూర్య మన కులపోడే.. ఓటేసి గెలిపించండి!

One Caste Owning RJ Surya in Bigg Boss Telugu 6: ​బిగ్ బాస్ ఆర్జే సూర్యను ఒక కులం వారు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 8, 2022, 03:42 PM IST
RJ Surya Caste issue: సూర్య మన కులపోడే.. ఓటేసి గెలిపించండి!

One Caste Owning RJ Surya in Bigg Boss Telugu 6: ఆర్జె సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్బాస్ సీజన్ సిక్స్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రేక్షకుల మన్ననలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందరి దగ్గర మంచి అనిపించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయనకు మంచి చేయాల్సింది పోయి ఆయనకు సంబంధించిన వాళ్లే ఆయన కొంప ముంచే ప్రయత్నం చేస్తున్నారు.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే చాలా మంది వ్యక్తులు తమ కులాలను బయటపెట్టాలి అని భావించరు. అయితే పేరు చివరన కులాల తోకలు కత్తిరించలేరు కాబట్టి కొంతమంది అలాగే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. గతంలో ఒక సీజన్లో రవికృష్ణ తమవాడే అంటూ ఒక కులానికి చెందినవారు పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే గాక అతను మన కులానికి మంచి పేరు తీసుకొస్తాడు కాబట్టి అతనిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆర్జే సూర్య విషయంలో కూడా అదే ప్రచారం మొదలుపెట్టారు ఆయన కులం వారు.

ఆర్జె సూర్య మన కులం వాడు కాబట్టి అతనికి ఓట్లు వేసి గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఆర్జే సూర్యకు మంచి ఫాలోయింగ్ తీసుకుని వస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే. ఎందుకంటే వ్యక్తిత్వం బాగుంటే అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తారు. ఒకవేళ అదే వ్యక్తిత్వం   బాగోకపోతే సొంత కులం వాళ్ళు కూడా పట్టించుకోరు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా ఒక కులానికి అతన్ని పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది.

ఈ విషయం మీద ఆయన సన్నిహితులైతే మండిపడుతున్నారు. సూర్యను ఒక కులానికి పరిమితం చేయవద్దని అతని విజయ అవకాశాలను అది కచ్చితంగా దెబ్బ తీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేడియో జాకీగా కెరియర్ ప్రారంభించిన ఆర్జే సూర్య సినీ రంగంలో కూడా ప్రవేశించారు. గుంటూరు టాకీస్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆయన తర్వాత గరుడవేగ సినిమాలో కూడా నటించారు. తెలుగులో సుమారు 100 మంది సెలబ్రిటీల వాయిస్లను మిమిక్రీ చేయగల సూర్య ప్రస్తుతం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇస్మార్ట్ న్యూస్ అనే ఒక ప్రోగ్రాంలో కనిపిస్తున్నాడు. 

Also Read: Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?

Also Read: Bigg Boss 6 Telugu Nominations: నామినేషన్స్ షురూ.. డేంజర్ జోన్లో ఏడుగురు.. ఎవరెవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News