ఓట్ల కోసమే కాంగ్రెస్ 'సుల్తాన్‌ల జయంతి'ని జరుపుతోంది: ప్రధాని మోదీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇవాళ చిత్రదుర్గ, రాయిచూర్, జమఖంది, హుబ్లీ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Last Updated : May 6, 2018, 01:04 PM IST
ఓట్ల కోసమే కాంగ్రెస్ 'సుల్తాన్‌ల జయంతి'ని జరుపుతోంది: ప్రధాని మోదీ

ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ సుల్తాన్‌ల జయంతిని జరుపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇవాళ చిత్రదుర్గ, రాయిచూర్, జమఖంది, హుబ్లీ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మోదీతో పాటు బీజీపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా వేరుగా కర్ణాటక రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అమిత్ షా బెలగావిలో రోడ్ షో పాటు రెండు చోట్ల భారీ బహిరంగ సభలో ప్రసగించనున్నారు.

చిత్రదుర్గలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులకు ఎవరిని గౌరవించాలో, ఎవరిని గౌరవించకూడదో తెలియదన్నారు. ఎవరిని గుర్తించుకోవాలో, ఎవరిని సత్కరించుకోవాలో వారికి(కాంగ్రెస్) తెలియదని, అలాంటి వాళ్లు సుల్తాన్‌ల జయంతిని జరుపుకోవడంలో ముందు వరుసలో ఉంటారని మోదీ అన్నారు. ఇది కేవలం ఓటుబ్యాంకు కోసమే అని ఉద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ అంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిజలింగప్ప తరహాలోనే అంబేద్కర్‌ను అవమానించారన్నారు. కాంగ్రెస్ నాయకులు కర్ణాటకను లూటీ చేశారని, వాళ్లు అధికారంలో ఉన్నంతకాలం కర్ణాటకను లూటీ చేస్తారని అన్నారు. చిత్రదుర్గ త్వరలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ హాట్‌స్పాట్‌గా మారుతుందని అన్నారు. చిత్రదుర్గ ఇస్రో కేంద్రంలో చంద్రయాన్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సిమ్యులేషన్ టెస్ట్‌లు మొదలుకావడం గర్వంగా ఉందని మోదీ అన్నారు.

 

Trending News