Kerala Nipah Virus: కేరళ రాష్ట్రానికి రాకపోకలు నిషేధించిన కర్ణాటక

Kerala Nipah Virus: కేరళలో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ..మరోవైపు కొత్తగా నిఫా వైరస్ కలకలం ఆందోళన కల్గిస్తోంది. రోజురోజుకూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండటంతో పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2021, 09:44 AM IST
  • కేరళలో ప్రమాదకరంగా మారుతున్న నిపా వైరస్
  • కేరళ రాష్ట్రానికి రాకపోకలపై ఆంక్షలు విధించిన కేరళ ప్రభుత్వం
  • కేరళలో కరోనా వైరస్‌తో పాటు నిపా వైరస్ సంక్రమణ
Kerala Nipah Virus: కేరళ రాష్ట్రానికి రాకపోకలు నిషేధించిన కర్ణాటక

Kerala Nipah Virus: కేరళలో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ..మరోవైపు కొత్తగా నిఫా వైరస్ కలకలం ఆందోళన కల్గిస్తోంది. రోజురోజుకూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండటంతో పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమైంది.

దేశంలో కరోనా సంక్రమణ మరోసారి పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ (Kerala)రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దేశంలోని మొత్తం కేసుల్లో సగం కంటే ఎక్కువ కేరళ నుంచే నమోదవుతుండటం కలవరం కల్గిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 30 వేల వరకూ కేసులు నమోదవుతున్న పరిస్థితి. అదే సమయంలో కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ బాలుడు నిఫా వైరస్ కారణంగా మరణించాడు. మరోవైపు నిఫా వైరస్(Nipah Virus)సంక్రమణ నెమ్మదిగా పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమైంది.

కేరళలో కరోనా వైరస్(Coronavirus), నిఫా వైరస్ సంక్రమణ నేపధ్యంలో కర్ణాటక రాష్ట్రం ఆంక్షలు(Karnataka Restrictions) విధించింది. ఆ రాష్ట్రానికి ప్రయాణాన్ని నిషేధిందింది.కేరళకు రాకపోకలు సాగించవద్దని స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప వెళ్లవద్దని సూచించింది. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. అక్టోబర్ నెలాఖరువరకూ ఈ పరిస్థితి కొనసాగనుంది. పొరుగు రాష్ట్రం కేరళలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో అన్ని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, నర్శింగ్ హోమ్‌లు, హోటళ్లు, పరిశ్రమలు, ఇతర సంస్థలు కేరళ రాష్ట్రానికి ప్రయాణాల్ని మానుకోవల్సి ఉంటుందని మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కేరళ నుంచి వచ్చే ప్రయాణీకులకు ప్రత్యేక నిబంధనలు సిద్ధం చేశారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. 

Also read: Nipah Virus: కేరళలో 'నిఫా' కల్లోలం! ఈ వైరస్ కు మందు లేదు..కట్టడి ఒక్కటే మార్గం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News