Highest Paid Jobs: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ఉద్యోగులు హోదాకే కాదు..డబ్బుల పరంగా కూడా అత్యున్నతమైనవి. ఆ ఉద్యోగంతో కలిగే ప్రయోజనాలు వింటే మీరు కూడా వదిలిపెట్టరిక. బైజూస్ అందిస్తున్న వివరాల ప్రకారం అత్యధిక జీతాలిచ్చే ఉద్యోగాలివే..
దేశంలో ఎన్నో ఉద్యోగాలున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ప్రైవేటులో జీతాలెక్కువ. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో అత్యధిక జీతాలుంటాయి. కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకుంటే..అవే కావాలంటారు. భారత విదేశాంగ శాఖ అధికారులు సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా నియామకమౌతారు. విదేశంలో భారత ప్రతినిధులుగా వ్యవహరించే అధికారులకు చాలా బాధ్యతలుంటాయి. విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యేవారి జీతం 60 వేలతో ప్రారంభమౌతుంది.
ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఓ ప్రత్యేక హోదా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీతం నెలకు 56 వేల నుంచి ప్రారంభమౌతుంది. ఖరీదైన ప్రాంతంలో బంగ్లా, అధికారిక వాహనం, సెక్యురిటీ, నౌకర్లు సహా ఇతర సౌకర్యాలు, వసతులు కలుపుకుంటే నెలకే మరో 3-4 లక్షల వరకూ ఉంటుంది. అంటే జీతం కంటే సౌకర్యాల విలువే ఎక్కువ.
ఇక ఢిఫెన్స్ సర్వీస్ అంటే రక్షణ రంగంలో ఉద్యోగాలకు ప్రారంభ వేతనం 55 వేలుంటుంది. ఇది క్రమంగా నెలకు 2.5 లక్షల వరకూ పెరుగుతుంది. ఇది కాకుండా సమాజంలో ఈ రంగంలో ఉన్నవారికి లభించే గౌరవం, హోదా, ఇతరత్రా ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇక చిన్నతనం నుంచి శాస్త్రవేత్తలుగానో..ఇంజనీర్లుగానో ఉండాలనుకునేవారికి ఇస్రో, డీఆర్డీవోలో ఉద్యోగాలు లభిస్తే ఇక తిరుగుండదు. ప్రారంభవేతనం 68 వేలుంటుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం. బ్యాంకింగ్ రంగంలో ఇదే సర్వోన్నతమైంది. ఇక్కడ ప్రారంభ వేతనం 65 వేలుంటుంది. ఇవి కాకుండా ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఫ్లాట్, ఇంధన ఖర్చు, పిల్లల చదువు ఖర్చులు అన్నీ లభిస్తాయి. ఇవన్నీ చదువుతుంటే మీక్కూడా ఆసక్తి కలుగుతోందా..మరింకేం కష్టపడి చదివితే ఆ కొలువులు మీకు సొంతం కావచ్చు.
Also read: Fir to file on Hero Suriya Jyothika: హీరో సూర్య, నటి జ్యోతికపై ఎఫ్ఐఆర్‌కు రంగం సిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook