Helicopter Crashing video: కేరళలో సోమవారం హెలీక్యాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. కొచి ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలీక్యాప్టర్ 30 - 40 అడుగుల ఎత్తులో ఉండగానే అదే చోట గింగిరాలు కొడుతూ కుప్పకూలింది. గాల్లోకి ఎగిరిన హెలీక్యాప్టర్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో మెయిన్ రన్ వే సమీపంలో ఉండగానే నేలకొరుగుతుండటం చూసి అప్రమత్తమైన పైలట్స్ చాకచక్యంతో వ్యవహరించారు. పైలట్స్ సమయసూర్తితో హెలీక్యాప్టర్‌ని రన్ వేపైనే కుప్పకూలకుండా రనే వేకు కొంత దూరం వరకు తీసుకెళ్లారు. దీంతో కొచి ఎయిర్ పోర్ట్ ద్వారా రాకపోకలు సాగించే విమానాల రాకపోకలకు అంతరాయం తప్పింది. కుప్పకూలిన సమయంలో అందులో ఉన్న ముగ్గురూ ప్రాణాలతో బయటపడగా.. వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్స్‌కి చెందిన ఈ Dhruv ALH Mk III హెలీక్యాప్టర్ ఇండియాలో తయారైనదే. కొచి ఎయిర్ పోర్టులోని కోస్ట్ గార్డ్స్ కాంప్లెక్స్ నుంచి ఈ హెలీక్యాప్టర్ సేవలు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్‌లో కంట్రోల్ రాడ్స్ బిగించిన తరువాత చాపర్ పని తీరు చెక్ చేసే క్రమంలోనే ఈ ఘటన జరిగింది. 12:25 గంటల సమయంలో చాపర్ టేకాఫ్ అవగా.. విమానాశ్రయంలోపలే అది కుప్పకూలిపోయింది.
హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన ఈ చాపర్ గాల్లోకి ఎగరడానికంటే ముందుగానే గ్రౌండ్‌పై చేయాల్సిన అని పరీక్షలు చేశారు. తమ పరిశీలనలో చాపర్ పని తీరు సరిగానే ఉందని సంతృప్తి పొందిన తరువాతే టేకాఫ్‌కి వెళ్లారు. అయినప్పటికీ చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో కోస్ట్ గార్డ్ సిబ్బందితో కలిసి హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకి చెందిన ఎరినాటిక్ ఇంజనీర్స్ చాపర్‌ని పరిశీలిస్తున్నారు.
An #ALH Mk 3 of the ICG today met with an accident near the main runway at Kochi Airport. All crew members are safe.
HAL and ICG are working towards resuming the operations of the grounded ALH MK3 fleet, Team had carried out extensive and satisfactory ground trials on 26 Mar 2023 pic.twitter.com/BcLruzuFka— Defence Decode® (@DefenceDecode) March 26, 2023
హెలీక్యాప్టర్ కూలిపోయిన ఘటనపై సంబంధిత అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో 2 గంటల పాటు విమానయాన సేవలను రద్దు చేసినట్టు కొచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ స్పష్టంచేసింది. మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో చాపర్ కూలిపోగా.. 2 గంటల వరకు కూలిపోయిన హెలీక్యాప్టర్‌ని అక్కడి నుంచి తొలగించి కోస్ట్ గార్డ్స్ కాంప్లెక్స్ షెడ్‌కి తరలించారు.
ఇది కూడా చదవండి : Jio Super Recharge Plan: నెలకు రూ. 240 ఖర్చుతోనే 84 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2GB డేటా
ఇది కూడా చదవండి : Oppo A78 5G Sale Offer: రూ. 22 వేల ఒప్పో A78 5G ఫోన్ కేవలం రూ. 950 కే
ఇది కూడా చదవండి : EPFO News Updates: పీఎఫ్ ఖాతాదారులకు మళ్లీ నిరాశ.. వడ్డీ రేటులో భారీ కోత..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK