కడుపు నొప్పి ( Abdominal Pain ) తో కోల్కతాకు చెందిన ఒక మహిళ ఆసుపత్రి వెళ్లింది. కొన్ని పరీక్షలు చేసిన తరువాత ‘ టెస్టిక్యూలర్ కేన్సర్ ‘ ( Testicular Cancer ) అని తెలుసుకుని షాక్ అయింది.
పశ్చిమ బెంగాల్ ( West Bengal ) కు చెందిన 30 మహిళ జీవితం అప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది. పరీక్షకు ముందు తాను మహిళ అనుకున్న ఆమె.. పరిక్షలు జరిగిన తరువాత వైద్యులు చెప్పింది విని షాక్ అయింది. ఎందుకంటే ఆమె జెనెటికల్ ( Genetical ) గా పురుషుడిగా జన్మించింది. అయితే శారీరకంగా ఒక మహిళకు ఉండాల్సిన అన్నిలక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులు ముందు కరియోటైపింగ్ ( Karyotyping) అనే టెస్ట్ ను నిర్వహించారు. ఇందులో ఆమె శరీరంలో ఉన్న క్రోమోజోన్ ( Chromozones ) లో XX అనే కాంప్లిమెంట్ కు బదులుగా XY అని తేలింది. Also Read : విషాదం: పెళ్లి తంతు ముగిసేలోపే వధువు మృతి
22 వేల మందిలో ఒకరికి మాత్రమే ఈ డిజార్డర్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి చూడ్డానికి, నడక, హావభావాలు ఇలా అన్ని లక్షణాలు పూర్తిగా మహిళను పోలి ఉన్నాయి. కానీ ఆ వ్యక్తిలో అండాశయం ( Ovaries ) , గర్భాశయం ( Uterus ) రెండూ లేవు. దాంతో ఆమెకు సంతానోత్పత్తి ( Reproduction ) సమస్యలు కూడా వస్తాయని వైద్యులు తెలిపారు.
అయితే ఆమెలో వ్రషణాలు ( Testicles ) ఉన్న విషయం కూడా టెస్ట్ చేసేంతవరకు తెలియలేదు. ఆ వ్యక్తి సోదరికి కూడా పరీక్షలు నిర్వహించగా ఆమెకు పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు.