కథువా చిన్నారి అత్యాచార, హత్య ఘటనను ఆసరాగా చేసుకుని హిందు-ముస్లింల మధ్య గొడవలను సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సున్నితమైన అంశం పట్ల కొంతమంది నోరు జారుతుండడం కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది.
తాజాగా కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన ఓ ఉద్యోగి కథువా చిన్నారి హత్యాచారంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతనిపై భగ్గుమన్నారు. 'చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ అమ్మాయి ఈ వయసులోనే చావడం మంచిదైంది. లేకపోతే భవిష్యత్‌లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేదేమో' అంటూ అతను చేసిన ఫేస్‌బుక్ పోస్టుపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అంతేకాదు, అతను పనిచేస్తున్న కొటక్ మహీంద్రా బ్యాంకును కూడా నెటిజన్లు హెచ్చరించారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తీసివేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో బ్యాంక్ యాజమాన్యం విష్ణు నందకుమార్ అనే సదరు ఉద్యోగిపై వేటు వేయడం గమనార్హం. ఏప్రిల్ 11న అతన్ని తొలగించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదని స్పష్టం చేసింది. అయితే పని తీరు సరిగా లేని కారణంగానే అతన్ని తొలగిస్తున్నట్టు కొటక్ యాజమాన్యం పేర్కొంది.
— Kotak Mahindra Bank (@KotakBankLtd) April 13, 2018