Flight crash: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే

కేరళలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల తాజా పరిస్థితి గురించి ఆరా తీసేందుకు కొజికోడ్ జిల్లా కలెక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ ( Help line number ) ప్రకటించారు.

Last Updated : Aug 7, 2020, 11:14 PM IST
Flight crash: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే

కొజికోడ్: కేరళలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల తాజా పరిస్థితి గురించి ఆరా తీసేందుకు కొజికోడ్ జిల్లా కలెక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ ( Help line number ) ప్రకటించారు. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వారి బంధువులు, కుటుంబసభ్యులు 0495 - 2376901 నెంబర్‌కి ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. Also read : AI  Flight  accident: కేరళలో విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన విమానం

దుబాయ్ నుంచి కేరళలోని కొజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ( AI flight ) క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. రాత్రి 7:45 నిమిషాలకు విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయినట్టు మలప్పురం జిల్లా ఎస్పీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపారు. మరో 123 మంది గాయపడ్డారని.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని మలప్పురం ఎస్పీ వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x