మహారాష్ట్రలో వలస కూలీలు ఘటన, విశాఖలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరచిపోకముందే మరో ఘోరం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 24 మంది దుర్మరణం చెందగా, మరో 22 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బంగారం ధరలు పైపైకి.. షాకిచ్చిన వెండి
ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు అతి వేగంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, అందువల్లే అధికంగా ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కొందరు వలస కూలీలు రాజస్థాన్ నుంచి సొంత రాష్ట్రం బిహార్, జార్ఖండ్‌కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తోన్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. చనిపోయిన వారిని బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. షాకింగ్: విశాఖలో మరిన్ని విష వాయువులు!
ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే 24 మంది చనిపోగా, 22 మందిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని అందిస్తున్నట్లు ఔరయ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అర్చన శ్రీవాస్తవ తెలిపారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని మెరుగైన చికిత్స కోసం సైఫాయ్ పీజీఐకి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు