బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు బంగారం ధరలు నేడు పెరిగాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు అమాంతం పెరిగాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు రూ.120 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,870కి పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,840కు చేరుకుంది. అందాలతో అదరగొడుతున్న RX 100 భామ
ఢిల్లీ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ.250 మేర పుంజుకున్న బంగారం నేడు రూ.600 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,800కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.45,600కు ఎగసింది.
ఈ నెలలో వెండి ధరలు భారీగా ర్యాలీ అవుతుండగా నేటి మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. నేడు వెండి ధర రూ.2100 మేర భారీగా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.45,250కి ఎగసింది. ఈ నెలలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు