దాణా కుంభకోణం 4వ కేసులో లాలూ దోషి

దాణా కుంభకోణం 4వ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ దోషిగా తేలారు.

Last Updated : Mar 19, 2018, 02:38 PM IST
దాణా కుంభకోణం 4వ కేసులో లాలూ దోషి

పాట్నా: దాణా కుంభకోణం 4వ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను, మరొక ఏడుగురిని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మరొక మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రాకు కోర్టులో ఊరట లభించింది. జగన్నాథ్‌ మిశ్రాతోపాటు మరొక ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా పేర్కొంది.

దాణా కుంభకోణం 4వ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ను దోషిగా, మరొక మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రాను నిర్దోషిగా కోర్టు ప్రకటించడంపై ఆర్జేడీ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మధ్య సంబంధ బాంధవ్యాల ఫలితమేజగన్నాథ్ మిశ్రా బైటపడటమని ఆయన వ్యాఖ్యానించారు. 'ఒకే కేసులో ఒకరికి జైలు‌, మరొకరికి బెయిల్‌, ఇదీ మోదీ ఆట‌' అని రఘవంశ్‌ ప్రసాద్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

Trending News