ఐశ్వర్యా రాయ్‌తో విడాకులు కావాలి !

ఘనంగా జరిగిన పెళ్లి.. ఆరు నెలల్లోనే విడాకులకు పిటిషన్ ! 

Last Updated : Nov 3, 2018, 12:55 AM IST
ఐశ్వర్యా రాయ్‌తో విడాకులు కావాలి !

రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం పాట్నాలోని సివిల్ కోర్టుని ఆశ్రయించారు. తన భార్య ఐశ్వర్యా రాయ్‌తో తనకు పొసగడం లేదని, ఆమెతో తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ తేజ్ ప్రతాప్ యాదవ్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది మే 12న తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం జరిగింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి డరోగా ప్రసాద్ రాయ్ మనవరాలైన ఐశ్వర్య రాయ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. 

ఐశ్వర్యా రాయ్ తండ్రి చంద్రికా రాయ్ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఇరు కుటుంబాలకు భారీ రాజకీయ నేపథ్యం ఉండటంతో ఈ వివాహానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ పెళ్లి ఇలా అనుకోకుండా విడాకులకు దారితీయడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
 

Trending News