LIC HFL Recruitment 2024: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..

LIC HFL Junior Assistant Recruitment 2024 :  ఈ పోస్టులకు దరఖాస్తు 2024 జూలై 25 నుంచి మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ lichousing.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Jul 26, 2024, 03:03 PM IST
 LIC HFL Recruitment 2024: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..

LIC HFL Junior Assistant Recruitment 2024 : నిరుద్యోగులకు ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (LIC HFL) భారీ జాబ్‌ నోటిఫికేన్‌ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యుర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టు వివరాలు, అర్హత, దరఖాస్తుకు చివరి తేదీ తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, పురుచ్చేరి, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, కశ్మీర్‌, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది.

ఈ పోస్టులకు దరఖాస్తు 2024 జూలై 25 నుంచి మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ lichousing.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ మాసంలో ఈ పోస్టలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్‌కు ఓ వారం ముందు హాల్‌ టిక్కెట్లను విడుదల చేస్తారు. 

ఇదీ చదవండిఆర్‌ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్‌ విడుదల.. 7,934 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు పీడీఎఫ్ డైరెక్ట్ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు క్షుణ్నంగా చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు.నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్‌  చేసుకోవాలి. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసుకోవాలి. ఈ పోస్టుకు ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.32,000 -రూ. 35,200 ఇందులోనే బేసిక్ పే, హెచ్‌ఆర్‌ఏ, పీఎఫ్ వంటి బెనిఫిట్స్‌ కూడా లభిస్తాయి.ఈ నోటిఫికేషన్‌ ద్వారా 200 పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 14. 

ఇదీ చదవండి: ఆధార్‌ కార్డుపై పేరు, అడ్రస్‌, పుట్టినతేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్‌ తెలుసుకోండి..
అర్హత..
అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందన యూనివర్శిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి.  వయస్సు 21-28 మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జీ పొంది ఉండాలి. సర్టిఫికేషన్‌ కంప్యూటర్‌లో పొంది ఉండాలి.  ఆన్‌లైన్‌ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

LIC HFL అధికారిక వెబ్‌సైట్‌లో 'Career, సెక్షన్‌లో 'Job Opportunities' పై క్లిక్‌ చేయాలి.
ఆ తర్వాత 'Recruitment of junior Assistants' క్లిక్‌ చేయాలి 
'Apply Online' సెలక్ట్‌ చేస్తే కొత్త స్క్రీన్‌ ఓపెన్‌ అవుతుంది.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి 'Click here for New Registration' క్లిక్‌ చేసి పేరు, కాంటాక్ట్‌ డిటైయిల్స్‌, ఇమెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. చివరగా అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసేముందు 'Save And Next' క్లిక్‌ చేయాలి. ఆ తర్వాతర ఫోటో సిగ్నేచర్‌, ఇతర డాక్యుమెంట్లు నమోదు చేయాలి. పేమెంట్‌ ట్యాబ్‌ ద్వారా డబ్బులు చెల్లించి సబ్మిట్‌ బట్టన్‌ నొక్కాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News