RRB JE Recruitment 2024: ఆర్‌ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్‌ విడుదల.. 7,934 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

RRB JE Recruitment 2024 Notification Out: రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు (RRB) సెంట్రల్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ (CEN-03/2024) విడుదల చేసింది. 7,934 జూనియర్‌ ఇంజినీర్ (JE) పోస్టుల ఖాళీల భర్తీకి ఆహ్వానం అందిస్తోంది. 

Written by - Renuka Godugu | Last Updated : Aug 4, 2024, 11:00 AM IST
RRB JE Recruitment 2024: ఆర్‌ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్‌ విడుదల.. 7,934 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

RRB JE Recruitment 2024 Notification Out: రైల్వే జాబ్‌ కొట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు (RRB) సెంట్రల్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ (CEN-03/2024) విడుదల చేసింది. 7,951 జూనియర్‌ ఇంజినీర్ (JE) పోస్టుల ఖాళీల భర్తీకి ఆహ్వానం అందిస్తోంది. ఇందులో డిపో మెటిరియల్ సూపరింటెండెంట్‌ , కెమికల్, మెటలార్జిక్‌ అసిస్టెంట్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఆసక్తిగల అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ rrbapply.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఆర్‌ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్‌ 2024 పీడీఎఫ్ కూడా అందుబాటులో ఉంది. దరఖాస్తులు 2024 జూలై 30 నుంచి 2024 ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నారు. 

పరీక్ష ఫీజు..
ఆర్‌ఆర్‌బీ జేఈ రిక్రూట్మెంట్‌ 2024 దరఖాస్తునకు అప్లికేషన్‌ ఫీజు జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళా, ట్రాన్స్‌జెండర్లకు రూ. 250 గా నిర్ణయించారు. ఫస్ట్‌ స్టేజ్‌రాత పరీక్ష పూర్తయిన తర్వాత బ్యాంక్‌ ఛార్జీలు మినహాయించి డబ్బులను రీఫండ్‌ చేస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్‌ రుసుము ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఈ ఆర్‌ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్‌ భర్తీకి వయో పరిమితి 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. ఏజ్‌ రిలాక్సేషన్‌ కూడా ఇస్తారు. 

ఇదీ చదవండి: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా? జాగ్రత్త.. ఐటీ నోటీసులు జారీ చేసే 5 ట్రాన్సాక్షన్స్‌ ఇవే..!

అర్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ లేదా బీఈ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి. మిగతా అర్హత వివరాలు ఆర్‌ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్‌ 2024 పీడీఎఫ్ లో క్షుణ్నంగా చదువుకుని అప్లై చేసుకోవాలి.

ఇదీ చదవండి:  Automatic Cars: రూ. 7 లక్షలలోపే టాప్‌ మైలేజ్‌ ఇచ్చే 5 ఆటోమెటిక్‌ కార్లు ఇవే..!

ఎంపిక చేసే విధానం..
ఆర్‌ఆర్‌బీ జేఈ పోస్టులకు అభ్యర్థులు ముందుగా రాత పరీక్ష (Computer based test) సీబీటీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. చివరగా మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ప్రాసెస్‌ ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం..
ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ rrbapply.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి
ఆ తర్వాత న్యూ రిజిస్ట్రేషన్‌ పై క్లిక్‌ చేయాలి.
మీ మొబైల్‌ నంబర్‌ లేదా ఇమెయిల్‌ ఐడీ, పాస్వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వాలి
ఆర్‌ఆర్‌బీ జేఈ 2024 అప్లికేషన్‌ ఫారమ్‌ పూర్తి చేయాలి
కావాల్సిన ధృవపత్రాలు, ఫోటో, సిగ్నేచర్‌ కూడా అప్లోడ్‌ చేయాలి.
అప్లికేషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లోనే ఫారమ్‌ సబ్మిట్‌ చేయాలి. 
ఒక ప్రింట్‌ తీసిపెట్టుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News