President Election Live: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? ద్రౌపది ముర్ముకు భారీగా క్రాస్ ఓటింగ్..

President Election: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు.

Edited by - Srisailam | Last Updated : Jul 18, 2022, 02:23 PM IST
President Election Live: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? ద్రౌపది ముర్ముకు భారీగా క్రాస్ ఓటింగ్..
Live Blog

President Election Polling: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో 776 ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది.  ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత ఎక్కువగానే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్ డేట్స్..

 

18 July, 2022

  • 14:21 PM

    రాష్ట్రపతి ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్



     

  • 14:05 PM

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

    మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటేసిన 117 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు

    కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటుపై వివాదం

    యశ్వంత్ సిన్హాకు బదులు పొరపాటున ముర్ముకు ఓటేసిన సీతక్క

     

  • 11:36 AM

    రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

     

  • 11:30 AM

    తెలంగాణ అసెంబ్లీలో తొలి ఓటు వేసిన మంత్రి కేటీఆర్

     

  • 10:58 AM

    పార్లమెంట్ లో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ

    సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్

    ఎన్డీఏ అభ్యర్థిగా భారీగా పెరిగిన మద్దతు

    విపక్షాల ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్?

  • 10:10 AM

    ఏపీ అసెంబ్లీలో తొలి ఓటు వేసిన సీఎం జగన్

    తెలంగాణ అసెంబ్లీలో ఓటేసిన మంత్రి కేటీఆర్

    హైదరాబాద్ లో ఓటు వేయనున్న ఏపీ వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

    యూపీ అసెంబ్లీలో తొలి ఓటు వేసిన సీఎం యోగీ ఆధిత్యనాథ్

     

  • 09:45 AM

    ఎంపీలకు గ్రీన్‌ బ్యాలెట్‌ పేపర్‌

    ఎమ్మెల్యేలకు పింక్‌ బ్యాలెట్ పేపర్‌

    ఎన్నికల అధికారులు ఇచ్చిన ప్రత్యేక పెన్ను ద్వారా మాత్రమే ఓటు

    టిఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లుగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హన్మంత్ షిండే

    కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

    బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ గా  రఘునందన్‌రావు

  • 09:40 AM

    రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 4,809

    543 మంది లోక్ సభ ఎంపీలు

    233 మంది రాజ్యసభ ఎంపీలు

    సగటు ఎంపీ ఓటు విలువ 700

    అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేలు 4,033

    ఎంపీ, ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 10,86,431

    ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 159

    తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132

     

Trending News