Manmohan Singh News Live Updates: దేశం ఓ దిగ్గజ నాయకుడిని కోల్పోయింది. దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలు అందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను ఎయిమ్స్ సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి ఇకలేరనే వార్తతో ప్రజలు కన్నీరు పెడుతున్నారు. 1991-96 కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను.. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయ, సినీ, అభిమానులు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.