Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?

Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు  ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 12, 2024, 12:58 PM IST
  • ఎన్నికల సిబ్బందికి ప్రత్యేకంగా ఫుడ్..
  • పోలింగ్ రోజు టమాటాకూర, సాంబారు..
Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?

Loksabha polls 2024 healthy food diet menu for elections duty employees: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ నడుస్తోంది. నిన్నటి వరకు అనేక పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. ఒకపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. నిన్న సాయంత్రంతో ఎన్నికల ప్రచారంకు బ్రేక్ పడింది. ప్రచారాల పర్వం ముగియడంతో కొంత మంది నేతలు సీక్రెట్ గా ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఓటుకు మూడు వేలు, మరికొన్ని చోట్ల  ఐదువేలు కూడా ఇస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అనేక ఘటనలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఇలాంటి ఘటనపై సీరియస్ గా ఉంది.  డబ్బులు, మద్యం సరఫరాకాకుండా ఎక్కడికక్కడ గట్టి చర్యలు చేపట్టింది.

Read more: Fight Breaks Out Mid flight: విమానంలో ఇదేం లొల్లి బాబోయ్.. లేడీ ఎయిర్ హోస్టెస్ ఆపిన ఆగకుండా.. వీడియో వైరల్..

ఈ క్రమంలో తెలంగాణాలో పదిహేడు లోక్ సభ, కంటోన్మెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏపీలో 175 , అసెంబ్లీ  స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు గాను రేపు మే 13 ఉదయం నుంచి ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈసీ ప్రత్యేకంగా రుచికరమైన డైట్ అందిస్తుంది.

ప్రస్తుతం ఎండ తీవ్రత కాస్తంత తగ్గింది. ఈ క్రమంలోనే.. 12 వ తేదీ సాయంత్రం ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జీగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. ఇక రాత్రిపూట 7 నుంచి 8 గంటల మధ్యలో అన్నం, చపాతీ, కూర టమాటా పప్పు, పెరుగు, చట్నీలు అందిస్తారు.

ఇక పోలింగ్ రోజున మే 13 మెనూ..

పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లను అందిస్తారు. ఆతర్వాత 8 నుంచి 9 గంటల మధ్య క్యారట్, టమాటాలతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ ఇస్తారు. 11, 12 మధ్యాహ్నం ప్రాంతంలో మజ్జిగ అందిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు.. కోడిగుడ్డు కూర, ఒక కర్రీ, చట్నీల, సాంబారు, పెరుగు భోజనంలో అందిస్తారు. మరల 3నుంచి 4 గంటల మధ్యలో మజ్జీగ లేదా నిమ్మరసం ఇస్తారు.

Read More: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

ఇక.. సాయంత్రం 5 తర్వాత టీ, బిస్కట్లు అందిస్తారు. ఈ సదుపాయలను గ్రామలలో పంచాయతీ అధికారులు, పురపాలికల్లో.. ప్రత్యేకంగా నియమించిన అధికారులు చూసుకొవాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్ కేంద్రాలలో ఒక వేళ రద్దీ ఎక్కువగా ఉంటే, ఎండల వేడి ఎక్కువగా ఉంటే ఏసీలు, కూలర్లు కూడా ఏర్పాటు చేయాలని ఈసీ అధికారులను ఆదేశించింది. ప్రజలంతా పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకొవాలని కూడా ఈసీ ప్రజలను కోరింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News