భోపాల్: జ్యోతిరాదిత్య సింధియకు మధ్యప్రదేశ్ సర్కార్ (Madhya Pradesh govt) షాక్ ఇచ్చింది. జ్యోతిరాదిత్య సింధియపై (Jyotiraditya Scindia) 2018లో మూసేసిన ఓ ల్యాండ్ డాక్యుమెంట్ ఫోర్జరీ కేసును (Forgery case) రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు మధ్యప్రదేశ్ ఎకనమిక్ వింగ్ (MP Economic Offences Wing) ప్రకటించింది. జ్యోతిరాదిత్య సింధియ కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపిలో చేరిన అనంతరం చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సింధియ వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం పార్టీకి రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. ఇక జ్యోతిరాదిత్య సింధియపై కేసు రీఓపెన్ విషయానికొస్తే.. ''2009లో జ్యోతిరాదిత్య సింధియ తనకు అమ్మిన భూమి ఉండాల్సిన భూమికంటే 6000 గజాలు తక్కువగా ఉందని.. కానీ ఆ భూమి డాక్యుమెంట్ను ఫోర్జరీ చేసి తనకు విక్రయించారు'' అని జ్యోతిరాదిత్య సింధియపై సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి 2014లో మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు.. 2018లో కేసును మూసేశారు. అయితే, తాజాగా మరోసారి జ్యోతిరాదిథ్య సింధియపై సురేంద్ర శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారని.. అందుకే ఆ ఫోర్జరీ కేసును రీఓపెన్ చేసి వాస్తవాలను తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు మధ్యప్రదేశ్ ఎకనమిక్ వింగ్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
మధ్యప్రదేశ్ సర్కార్ తీరుపై జ్యోతిరాదిత్య సింధియా ప్రధాన అనుచరుడు పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ.. ఇది రాజకీయ కక్ష సాధింపే అవుతుందని అన్నారు. '' సింధియా తప్పు చేశారనడానికి ఆధారాలు లేవనే ఈ కేసును మూసేశారు. కానీ రాజకీయ కక్షలతోనే మళ్లీ ఈ కేసును రీఓపెన్ చేశారు. ఏదేమైనా రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. తమకు న్యాయం జరుగుతుంది'' అని పంకజ్ ధీమా వ్యక్తంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..