School Bus Stuck in Floods: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలే కాదు పట్టణాలు, నగరాల్లోని నాలాలు కూడా ఉప్పొంగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఓ నాలా ఉప్పొంగి రోడ్డు పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఓ స్కూల్ బస్సు ఆ వరదలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 24 మంది విద్యార్థులు ఉన్నారు. వరదలో బస్సు సగం వరకు మునిగిపోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు కొంతమంది గ్రామస్తుల సహాయక చర్యలతో ఆ బస్సుకు ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
వరదలో చిక్కుకుపోయిన బస్సుకు తాడును కట్టి.. ఓ ట్రాక్టర్ సాయంతో దాన్ని బయటకు లాగగలిగారు. దీంతో బస్సు వరద నుంచి ఒడ్డుకు చేరగలిగింది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా బికల్‌ఖేడీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లడం వల్లే బస్సు వరదలో చిక్కుకుపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు గత వారం ఓ కారు వరదలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG
— Siraj Noorani (@sirajnoorani) July 23, 2022
Also Read: Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.