కరోనా ‘మహా’ విలయం.. 4వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Last Updated : Apr 20, 2020, 07:51 AM IST
కరోనా ‘మహా’ విలయం.. 4వేలు దాటిన కేసులు

ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4000 మార్క్ దాటింది. మహారాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 552 కొత్త కేసులు నమోదయ్యాయి. అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు 

ఈ తాజా కేసులతో ఇక్కడి కోవిడ్19 పాజిటివ్ బాధితుల సంఖ్య 4,200కు చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ కేసులలో కేవలం ముంబై నగరం నుంచే 2,724 కేసులు రావడం గమనార్హం. కరోనా బారిన పడి మహారాష్ట్రలో ఇప్పటివరకూ 223 మంది మరణించారు. ఆదివారం ఒక్కరోజే 12 మరణాలు సంభవించాయని రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది.  PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!

తాజా మరణాలలో సగం మరణాలు ముంబైలో సంభవించాయి. ముంబైలో ఆరుగురు వ్యక్తులు కరోనాతో పోరాడుతూ చనిపోగా, మాలేగావ్‌లో నలుగురు, సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక్కరు, జాంఖెడ్ అహ్మద్ నగర్‌లో మరో వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడు. ప్రతి 8 మంది బాధితులలో ఆరుగురికి షుగర్, బీపీ, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.     జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Trending News