Sushant Singh: సీబీఐ దర్యాప్తు అవసరమే లేదు: మహారాష్ట్ర హోంమంత్రి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant singh Rajput ) మరణం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. దీనికి కారణం సుశాంత్ ఆత్మహత్యపై ( Sushant Suicide ) రేగిన అనుమానాలు, బాలీవుడ్ లోని బంధుప్రీతి ( Nepotism )పై వచ్చిన ఆరోపణలు. ఈ నేపధ్యంలో సీబీఐ దర్యాప్తు డిమాండ్ ఎక్కువే విన్పించింది. అయితే మహారాష్ట్ర హోంమంత్రి ఆ అవసరం లేదని తేల్చి చెప్పేశారు.

Last Updated : Jul 17, 2020, 08:22 PM IST
Sushant Singh: సీబీఐ దర్యాప్తు అవసరమే లేదు: మహారాష్ట్ర హోంమంత్రి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant singh Rajput ) మరణం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. దీనికి కారణం సుశాంత్ ఆత్మహత్యపై ( Sushant Suicide ) రేగిన అనుమానాలు, బాలీవుడ్ లోని బంధుప్రీతి ( Nepotism )పై వచ్చిన ఆరోపణలు. ఈ నేపధ్యంలో సీబీఐ దర్యాప్తు డిమాండ్ ఎక్కువే విన్పించింది. అయితే మహారాష్ట్ర హోంమంత్రి ఆ అవసరం లేదని తేల్చి చెప్పేశారు.

సుశాంత్ సింహ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) మరణంపై చాలాకాలంగా రకరకాల వాదనలు, డిమాండ్లు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ( Demand of CBI Enquiry ) చేయించాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. సీబీఐ దర్యాప్తు చేయిస్తేనే అసలు విషయాలన్నీ బయటపడతాయని కుటుంబసభ్యులు , అభిమానులు అందరూ డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో  మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government ) స్పష్టత  ఇచ్చింది. సుశాంత్ సింహ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Maharashtra Home minister Anil Deshmukh ) స్పష్టం చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు ( Mumbai police ) సమర్ధవంతంగా ఛేధిస్తారని చెప్పారు. సుశాంత్ విషాదాంతం కేసులో వ్యాపారపరంగా శత్రువులున్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. Also read: Covid19: దేశంలో అత్యంత ప్రమాదకర జిల్లాలివే

జూన్ 14న ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్ ( Bandra Apartment ) లో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రాధమికంగా పోలీసులు ఆత్మహత్యగా ఈ కేసును పేర్కొన్నారు. తీవ్రమైన నిరాశకు లోనై ఉన్న సుశాంత్ చికిత్స కూడా పొందుతున్నారనేది పోలీసుల వాదన. ఈ నేపధ్యంలోనే ఎటువంటి పరిస్థితుల్లో నిరాశకు లోనయ్యారా అనే విషయంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు అవసరమని సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ( Rhea Chakravarty ) కూడా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర హోంమంత్రి ఆ అవసరం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. Also read: BMW: ఆ బైక్ ధర 20 లక్షలే

Follow us on twitter:

Trending News