Aaditya Thackeray Vs Deora: మహారాష్ట్ర ఎన్నికల్లో ఆదిత్య థాక్రే కు చెమటలు పట్టిస్తున్న మిలింద్ దేవ్ రా.. శివసేన వర్సెస్ శివసేన విజేత ఎవరో..

Aaditya Thackeray Vs Deora: మహారాష్ట్ర ఎన్నికల్లో ఆదిత్య థాక్రే కు చెమటలు పట్టిస్తున్న మిలిండ్ దేవ్ రా.. శివసేన  (ఉద్దవ్ థాక్రే)వర్సెస్ శివసేన శిండే మధ్య హోరా హోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.దాదాపు 7 రౌండ్ల వరకు ఇద్దరినీ మెజారిటీ దోబూచులాడింది. ఇది అక్కడ ఆసక్తికర అంశంగా మారింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 23, 2024, 02:33 PM IST
Aaditya Thackeray Vs Deora: మహారాష్ట్ర ఎన్నికల్లో ఆదిత్య థాక్రే కు చెమటలు పట్టిస్తున్న మిలింద్ దేవ్ రా.. శివసేన వర్సెస్ శివసేన విజేత ఎవరో..

Aaditya Thackeray Vs Deora: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దుమ్ము దులిపింది. మొత్తంగా 288 సీట్లకు గాను 145 మెజారిటీ మార్క్ దాటేసి.. 222 సీట్లలో లీడింగ్ లో ఉంది. తాజాగా ఈ ఎన్నికలు శివసేన (శిండే), శివసేన (ఉద్ధవ్ థాక్రే)తో పాటు, ఎన్సీపీ (అజిత్ పవార్), ఎన్సీపీ శరత్ పవార్ కు చావో రేవో అన్నట్టు సాగింది. ఈ ఎన్నికల్లో ప్రజలు శివసేన ఉద్ధవ్ థాక్రేతో పాటు శరత్ పవార్ ను ప్రజలు ఛీత్కరించారు. మొత్తంగా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, శరత్ పవార్ లకు ఇది చివరి ఎన్నికలు అని చెప్పాలి. ఇకపై వీరి పార్టీలు మనగడ సాగించడం కష్టమే. కానీ వీరి నుంచి చీలిన పార్టీలైన శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు మాత్రమే మనగడ సాగించే అవకాశాలున్నాయి.

అయితే ఈ ఎన్నికల్లో అందరినీ దృష్టిని ఆకర్టిస్తోన్న స్థానం సౌత్ ముంబైలోని వర్లీ నియోజక వర్గం.  ఈ నియోజకవర్గంలో ఉద్ధవ్ థాక్రే రాజకీయ వారసుడు.. ఆదిత్య థాక్రే పోటీ చేసారు. అతనికి ప్రత్యర్ధిగా ఏక్ శిండే నేతృత్వంలో శివసేన అభ్యర్ధిగా మిలింద్ దేవరా పోటీకి దిగారు. తాజాగా ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఇద్దరు మధ్య విజయం దోబూచులాడుతూ వచ్చింది. దాదాపు 9 రౌండ్ల వరకు ఇది ఒరవడి కొనసాగింది. తాజాగా 13 రౌండ్స్ తర్వాత మిలింద్ దేవ్ రా పై ఆదిత్య థాక్రే 13 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆదిత్య థాక్రే దాదాపు 67 వేలకు పైగా మెజారిటీతో ఎన్సీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. మరోవైపు ఎంఎన్ఎస్ నుంచి సందీప్ సుధాకర్ దేశ్ పాండే పోటీ చేసారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో చోటా థాక్రే మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. మొత్తంగా ఈ స్థానం శివసేన ఉద్ధవ్ థాక్రే నిలబెట్టుకునేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆదిత్య థాక్రే .. రాజకీయంగా మళ్లీ నిలదొక్కుకొని తన పార్టీని నిలబెట్టుకుంటారా అనేది చూడాలి.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News