ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..!!

ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈసారి ఓ చెప్పుల  తయారీ సంస్థలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ కేశవపురంలో ప్రమాదం చోటు చేసుకుంది.

Last Updated : May 26, 2020, 10:59 AM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..!!

ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈసారి ఓ చెప్పుల  తయారీ సంస్థలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ కేశవపురంలో ప్రమాదం చోటు చేసుకుంది.

కేశవపురం ప్రాంతంలో ఇవాళ ఉదయం ఉన్నట్టుండి.. ఓ చెప్పుల తయారీ సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. త్వరత్వరగానే మంటలు ఫ్యాక్టరీ అంతటా అంటుకున్నాయి. దీంతో వెంటనే తేరుకున్న స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షణాల్లోనే 23 ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


 
అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలియరాలేదు. బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News