మోదీకే అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: స్పందించిన మమతా బెనర్జి

మోదీకే అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: స్పందించిన మమతా బెనర్జి

Last Updated : May 19, 2019, 09:57 PM IST
మోదీకే అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: స్పందించిన మమతా బెనర్జి

కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కొద్దిసేపటి క్రితం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసి అధినేత్రి మమతా బెనర్జి తనదైన స్టైల్లో స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విశ్వసించొద్దని చెబుతూ ఆ ఫలితాలు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే అనుకూలంగా రావడాన్ని ఆమె ఓ గాసిప్‌గానే కొట్టిపారేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపిని ఓడించి కేంద్రంలో మోదీ సర్కార్ రాకుండా ఉండేందుకు శాయశక్తులా పోరాడిన మమతా బెనర్జి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి పుకార్లను వ్యాపింపచేసే క్రమంలో వేల కొద్ది ఈవీఎంలను మార్చే కుట్రకు పాల్పడాలని చూస్తున్నారని అభిప్రాయపడిన మమతా బెనర్జి.. ఇలాంటప్పుడే ప్రతిపక్షాలన్నీ ఐక్యమత్యం చాటుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మూడు సంస్థలు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే అధిక మెజారిటీ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300పైగా సీట్లు గెల్చుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని న్యూస్18-ఐపిఎస్ఓఎస్ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో స్పష్టంచేసింది.

Trending News