బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన మమత !!

బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కౌంటర్ ఇచ్చారు

Updated: May 16, 2019, 06:14 PM IST
బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన మమత !!

బీజేపీకి 300కి తగ్గకుండా సీట్లు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బల్లగుద్ది చెబుతుంటే..కమలం పార్టీకి అంత సీన్ లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టే పారేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కకట్టి చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్ల లోపులోనే వస్తాయని  మమత బెనర్జీ జోస్యం చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. తెలంగాణలో కూడా ఆ పార్టీకి సీటు రావడం కష్టమేనన్నారు. ఇక మహారాష్ట్రలో కూడా 20 సీట్లకు మించి రావని లెక్క కట్టిన మమత మొత్తం మీద కమలం పార్టీ గతంలో కంటే ఈ సారి 200 సీట్లను కోల్పోనుందని చెప్పారు. 

బీజేపీ చీఫ్ అమిత్ షా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటికే మెజార్టీ సీట్లు (272) సాధించిందని..ఏడో దశ ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధింస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే సరికి తమ పార్టీకి 300కి తగ్గకుండా సీట్లు వస్తాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన మమత ఈ మేరకు స్పందించారు. మరి అమిత్ షా చెప్పినట్లుగా బీజేపీకి 300 సీట్లు వస్తాయో..లేదంటే దీదీ చెప్పినట్లు 100 సీట్లకే ఆ పార్టీ పరిమితమౌతుందా అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి..