కరెన్సీ నోట్లను ముక్కుతో తుడుచుకున్న యువకుడి అరెస్టు...

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతుంటే మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నాసిక్‌కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు

Last Updated : Apr 4, 2020, 07:14 PM IST
కరెన్సీ నోట్లను ముక్కుతో తుడుచుకున్న యువకుడి అరెస్టు...

ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతుంటే మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నాసిక్‌కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు ఉన్న వీడియో ఇప్పుడు దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేవలం కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన నాసిక్ పోలీసులు గురువారం సయ్యద్ బాబును అరెస్టు చేశారు. ఏప్రిల్ 7దాకా అతడిని కస్టడీలో ఉంచేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ప్రకంపనలతో ఓ వర్గంపై సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటువంటి దుశ్యర్యకు పాల్పడడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read Also: కరోనాతో 15 మంది ఎన్నారైలు మృతి

మహారాష్ట్రలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి. మహారాష్ట్రలో మొదటినుండి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిరంతరంగా పెరుగుతూ దేశంలోనే అత్యధికంగా 537 కేసులు నమోదు చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తించిన కోవిడ్ (COVID) కేసుల సంఖ్య 3482కు చేరింది. మొత్తం కేసుల్లో 3153 యాక్టివ్ కేసులు కాగా, 238 వ్యాధి నయమై డిశ్చార్జ్ చేసిన కేసులు, 91 మృతి చెందిన కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News