Lover Killed: పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా మరో యువతిపై కన్నేశాడు. ఆమెను ప్రేమలోకి దింపి సహజీవనం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెతో ఓ పిల్లాడిని కూడా కన్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ సంవత్సరం తర్వాత అతడు తన ప్రియురాలు, వీరి ప్రేమకు గుర్తుగా కలిగిన అబ్బాయిని అత్యంత దారుణంగా అతడు హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివాహేతర సంబంధం చివరికి విషాదంగా మిగిలింది.
Also Read: Mancherial News: అయ్యో.. కన్నవాళ్లకు పుట్టేడు బాధను మిగిల్చిన యువతి.. ఫోన్ కోసం..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ సచిన్ వినోద్ కుమార్ రౌత్(32) ట్రక్ డ్రైవర్. అతడికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉననారు. అయితే అతడు కుటుంబానికి తెలియకుండా మధ్యప్రదేశ్‌కు చెందిన నజ్నిన్ (30) అనే యువతితో ప్రేమాయణం నడిపించాడు. ఆ కొన్నాళ్లకు ఆమెతో సహజీవనం చేశాడు. వీరి రహాస్య జీవనానికి కుమారుడు పుట్టగా యుగ్ అని పేరు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ముగ్గురు చనిపోయారు. నాగ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో వీరు ముగ్గురు విగతజీవులుగా మిగిలారు. హోటల్ సిబ్బంది సమాచారం ఆధారంగా అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హోటల్‌లోని పరిసరాలు గమనిస్తే అక్కడ ఏం జరిగిందో పోలీసులు ప్రాథమికంగా వివరించారు.
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి మళ్లీ తప్పిన ప్రమాదం.. నెలలో ఇది రెండోసారి
నాగ్‌పూర్‌లోని ఓ హోటల్‌కు శనివారం (ఏప్రిల్ 13) రోజు సచిన్ వినోద్ కుమార్ రౌత్, నజ్నిన్, ఏడాది వయసున్న యుగ్‌తో కలిసి వచ్చారు. ఆదివారం చూసేసరికి వారు ముగ్గురు చనిపోయి ఉన్నారు. మొదట తన ప్రియురాలు నజ్నిన్‌ను వినోద్ కుమార్ చంపేశాడు. అనంతరం కుమారుడు యుగ్‌ను హతమార్చాడు. నజ్నిన్‌ను అత్యంత దారుణంగా హతమార్చాడు. తలపై సుత్తితో కట్టి చంపినట్లు గుర్తించారు. చిన్నారి యుగ్‌కు విషాహారం తినిపించి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రేమించి సహజీవనం చేసిన వినోద్ కుమార్ కొన్ని రోజులుగా నజ్నిన్‌ను పట్టించుకోవడం లేదు. తమకు దూరంగా ఉంటుండడంతో నజ్నిన్ వినోద్ కుమార్‌పై గొడవకు దిగారు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ తాను నజ్నిన్, ఆమె కుమారుడు యుగ్‌ను చంపేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే హోటల్‌కు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అతడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది ఈ హత్యలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీస్ బృందం హోటల్‌లో మొత్తం పరిశీలన చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter