Revanth Reddy: అధికారం చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి బిజీబిజీ అయ్యారు. పాలనా వ్యవహారాలు చూసుకుంటూనే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ బిజీ అయ్యారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనకు వెళ్లిన సమయంలో రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే నెలలో ఇలా ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
Also Read: Revanth Reddy Flight: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం సోమవారం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరగా మార్గమాధ్యలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్దకు రాగానే ప్రమాదం సంభవించింది. కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ పంక్చర్‌కు గురయి పేలిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలియక కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో మిగతా కాన్వాయ్ సిబ్బంది ఆగి ఏం జరిగిందో పరిశీలించారు.
Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు
టైర్ పంక్చరైన విషయాన్ని గమనించారు. కాన్వాయ్‌లో కూర్చున్న వారికి కూడా గాయాలు కాలేదు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు ప్రయాణం కొనసాగించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దెబ్బతిన్న టైర్లను మార్చి తమ పర్యటనను యథావిధిగా కొనసాగించారు. కొడంగల్ చేరుకున్నాక రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో లోక్‌సభ ఎన్నికలపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
నెలలో రెండోది
తరచూ రేవంత్ రెడ్డికి ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతనెల 17వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం (6E5099) గంటన్నర పాటు ఆలస్యమైంది. ముంబై బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజన్ ప్రారంభం కాలేదు. ఆ విమానంలో రేవంత్‌రెడ్డి, దీపా మున్షీ, భట్టి తదితరులు ఉన్నారు. సమస్యను పునరుద్ధరణ చేసిన అనంతరం విమానం ముంబై బయల్దేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతేడాది ఇదే నెలలో..
గతేడాది ఇదే మార్చి నెలలో రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేటలో పర్యటనకు వెళ్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అతివేగంగా వెళ్తూ ఓ కారు కాన్వాయ్‌లోని ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఎయిర్ బ్యాగ్‌లు తెరచుకోవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter