చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో పొత్తుపై స్పందించిన మాయావతి

Last Updated : Sep 20, 2018, 07:48 PM IST
చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో పొత్తుపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి క్లారిటీ ఇచ్చారు. చత్తీస్‌ఘడ్‌లో రానున్న ఎన్నికల్లో అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌ చత్తీస్‌ఘడ్‌తో చేతులు కలపనున్నట్టు మాయావతి స్పష్టంచేశారు. సీట్ల పంపకంపై సైతం మరింత స్పష్టత ఇస్తూ చత్తీస్‌ఘడ్‌లో మొత్తం 90 స్థానాలు ఉండగా అందులో 35 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుండగా మిగతా 55 స్థానాల్లో జనతా కాంగ్రెస్ చత్తీస్‌ఘడ్‌ పోటీ చేస్తుందని చెప్పారు. ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే, అజిత్ జోగి ముఖ్యమంత్రి అవుతారని కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని సైతం ప్రకటించారామె. 

కాంగ్రెస్ పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయనే ఊహాగానాలకు ఆమె చేసిన ఈ ప్రకటనతో ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది.

Trending News