Meta Lay offs: కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. మెటాలో మరో 10 వేల మంది తొలగింపు!

Second round of layoffs expected at Meta Today. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ఇప్పటికే 11 వేల మందిని తొలగించగా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 19, 2023, 03:55 PM IST
Meta Lay offs: కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. మెటాలో మరో 10 వేల మంది తొలగింపు!

Meta plans more layoffs across Facebook and WhatsApp: గత కొన్ని నెలలుగా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ఇప్పటికే 11 వేల మందిని తొలగించగా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. నేడు ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆర్ధిక మాంద్యం నియంత్రణలో భాగంగా మరో 10,000 మందిని తొలగించాలని మెటా నిర్ణయించినట్లు సమాచారం.

2022 నవంబరు మాసంలోనే కంపెనీ సిబ్బందిలో 13 శాతం (11,000 మందిని) మెటా తొలగించింది. అదే సమయంలో కొత్త నియామకాలనూ నిలిపివేసింది. తాజాగా మెనేజర్లకు పంపిన సమాచారంలో కంపెనీలోని ఉద్యోగుల బృందాలన్నింటినీ పునఃనిర్మించనున్నట్లు సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. లే ఆఫ్‌ల తర్వాత కొంత మంది కొత్త ప్రాజెక్టులపై పనిచేయాల్సి రావొచ్చని స్పష్టం చేశారు. ఇక వచ్చే నెలలో మరికొంత మందిని తీసివేసే అవకాశం ఉందట.

మెటా (Meta Lay offs) పరిధిలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వర్చువల్‌ రియాలిటీ ఉన్న విషయం తెలిసిందే. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే మేనేజర్లకు అంతర్గతంగా సమాచారం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2023 మార్చిలోనే సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈ మేరకు సంకేతాలిచ్చారు. అన్ని కంపెనీల్లోని విభాగాల్లో సిబ్బంది కూర్పును పరిశీలించి.. కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా లే ఆఫ్‌లకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. 

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ 'వాల్ట్‌ డిస్నీ' సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని సమాచారం. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 15 శాతం మంది ఉద్యోగులపై వేటు పడనుందట. వచ్చే వారంలో టీవీ, ఫిల్మ్‌, థీమ్‌ పార్క్‌, కార్పొరేట్‌ విభాగాల్లో ఈ కోతలు ఉండబోతున్నాయి. ఏప్రిల్‌ 24 నాటికి తొలగింపుల సమాచారం ఉద్యోగులకు అందనుందట. 2023 ఫిబ్రవరిలో 7 వేల మంది ఉద్యోగులను వాల్ట్‌ డిస్నీ తీసివేసింది. రెండోసారి వేలాది ఉద్యోగులను తొలగించనుంది.

Also Read: Mohammed Siraj IPL Betting: తెలుగోడి నుంచి కాల్.. బెట్టింగ్ ట్రాప్‌లో మొహ్మద్ సిరాజ్! బీసీసీఐ విచారణ

Also Read: IPL 2023 Points Table: ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్! సన్‌రైజర్స్‌ స్థానం ఎంతో తెలుసా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x