Hyderabad Driver approached Mohammed Siraj for RCB inside information: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ 'ఐపీఎల్' అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించడమే కాకూండా.. వ్యాపారస్థులకు కోట్ల ఆదాయం, బీసీసీఐకి ఊహించని డబ్బు, రాత్రికి రాత్రే క్రికెటర్లపై కనక వర్షం కురుప్పిస్తుంది. ఐపీఎల్ అంటే పైకి కనిపించే మెరుపులు, డబ్బుతో పాటు చీకటి కోణాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైంది బెట్టింగ్. ఐపీఎల్ సాగుతున్నంతసేపు కోట్ల రూపాలు ప్రతి రోజు చేతులు మారుతాయి. ఐపీఎల్ 2023కు సంబంధించిన ఒక సంచలన నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ సమయంలో బుకీల మాయాజాలంలో పడి ఇప్పటికే ఎస్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలు నిషేదానికి గురయ్యారు. ప్లేయర్స్ మాత్రమే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై కూడా రెండేళ్ల నిషేధం పడింది. ఆ దెబ్బతో ప్లేయర్స్, ప్రాంఛైజీలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. దాంతో 10 ఏళ్లుగా బెట్టింగ్ ఊసే రాలేదు. తాజాగా టీమిండియా పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌ను (Mohammed Siraj IPL Betting) బెట్టింగ్ మాఫియా బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అతడు ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి సంబంధించిన కీలకమైన అంతర్గత సమాచారాన్ని తనకు చేరవేయాలంటూ ఓ వ్యక్తి మొహ్మద్ సిరాజ్‌ను సంప్రదించాడు. ఈ విషయంను బీసీసీఐ చెప్పగా.. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) రంగంలోకి దిగింది. సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదని, హైదరాబాద్‌కు చెందిన ఓ డ్రైవర్ అని ఏసీయూ ధృవీకరించింది. అతనికి బుకీలు లేదా బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఏసీయూ విచారణ జరుపుతోంది. ఆ వ్యక్తి కాల్ లిస్ట్, పూర్తి వివరాలను తెలుకునేందుకు ఏసీయూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
ఐపీఎల్ మ్యాచ్‌లపై భారీ ఎత్తున డబ్బులు పెట్టి నష్టపోయానని, ఆ డబ్బుని తిరిగి సంపాదించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై బెట్టింగులు పెట్టాలని నిర్ణయించకున్నాన్నానని, బెంగళూరు జట్టు అంతర్గత సమాచారం తనకు తెలియజేయాలని మొహ్మద్ సిరాజ్‌ను ఆ వ్యక్తి సంప్రదించినట్లు ఏసీయూ ప్రాథమిక విచారణలో తేలిందట. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడవుతాయని అధికారు చెప్పారట. ఏదేమైనా సిరాజ్ స్వస్థలం హైదరాబాదే కావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.