Rajasthan Royals take top spot in IPL 2023 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత గడ్డపై రసవత్తరంగా సాగుతోంది. దాదాపుగా ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగుతోంది. ఈ వారంలో బెంగళూరు-చెన్నై, ముంబై-సన్‌రైజర్స్ జట్ల మధ్య మ్యాచులు కూడా చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగాయి. దాంతో క్రికెట్ అభిమానులు కూడా హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపుగా మూడేళ్ల తర్వాత సొంత మైదానాల్లో మ్యాచులు జరుగుతుండడంతో ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఐపీఎల్ 2023లో మొత్తం 10 జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో తొలి 25 మ్యాచులు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో (IPL Points Table 2023) టాప్‌లో ఏ టీమ్ ఉందో, అట్టడుగు స్థానంలో ఏ జట్టు ఉందో చూద్దాం. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవడంతో స్వల్ప మార్పులు చోరుచేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టాప్‌లో ఉంది. ఆడిన 5 మ్యాచులలో 4 గెలిచి.. 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఐపీఎల్ 2023 పాయింట్స్ పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచులలో 3 గెలిచి 6 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కూడా వరుసగా ఉన్నాయి. ఈ నాలుగు జట్లకు ఆరేసి పాయింట్స్ ఉన్నా.. నెట్ రన్ రేట్ కారణంగా 3,4,5,6 స్థానాల్లో నిలిచాయి. ఈ నాలుగు జట్లు 5 మ్యాచులు ఆడి మూడు విజయాలు సాధించాయి. కోల్‌కతా (4 పాయింట్స్), బెంగళూరు (4 పాయింట్స్), హైదరాబాద్ (4 పాయింట్స్) జట్లు 7,8,9 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆడిన 5 మ్యాచులలో ఓడిన ఢిల్లీ అట్టడుగున ఉంది.
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఇచ్చే క్యాప్-Orange Cap) లిస్టులో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి 259పరుగులు చేశాడు. కోల్‌కతా బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ 5 మ్యాచులు ఆడి 234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే క్యాప్-Purple Cap) పట్టికలో రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (11 వికెట్లు) అగ్రస్థానం ఉండగా.. మార్క్ వుడ్ (11 వికెట్లు), రషీద్ ఖాన్ (11 వికెట్లు) అగ్ర స్థానంలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.