Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు

Big Relief To Taxpayers In Budget 2024 25 Tax Slab Will Change: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలతోపాటు వేతన జీవులకు భారీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మలమ్మ తన బడ్జెట్‌లో తాయిలాలు, వరాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 20, 2024, 10:20 PM IST
Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు

Good News To Taxpayers: మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే మధ్య తరగతి భారీ శుభవార్త తెలపబోతున్నది. ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రజానీకానికి భారీ ఊరట లభించేలా తాయిలాలు ప్రకటించనుందని సమాచారం. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలకు ఊరటనివ్వలేదు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు కానుకలు ఉండనున్నాయనే వార్తలు వస్తున్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. త్వరలోనే 2025-26కు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌ రూపకల్పనలో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పేదలు, ఉద్యోగులకు భారీ ఊరట కల్పించనున్నట్లు చర్చ జరుగుతోంది. బడ్జెట్‌ నుంచి ప్రజలు ఆశించేది పన్ను మినహాయింపునే. ఆ పన్ను మినహాయింపు రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఆదాయ పన్ను రేట్లను తగ్గించి నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించాలని చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు కొత్త పన్ను విధానం రూపకల్పనలో ఆర్థిక నిపుణులు ఉన్నట్లు సమాచారం. కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదని చర్చ జరుగుతోంది. ఇక రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఏం చేస్తారోనని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ప్రజా తీర్పుతో మార్పు
పదేళ్లుగా పరిపాలించిన మోదీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు పొందలేదు. కార్పొరేట్‌ రంగానికి లబ్ధి చేకూర్చేలా పని చేసిందనే విమర్శలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు కూడా అదే నిరూపించాయి. అలాంటి మోదీ ప్రభుత్వానికి ప్రజలు సీట్ల కోత విధించారు. ప్రజల ఆగ్రహన్ని గ్రహించిన ఎన్డీయే ప్రభుత్వం ఇకనైన పేద, మధ్య తరగతి ప్రజలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బడ్జెట్‌లో పేదలకు భారీగా వరాలు వచ్చే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News