Petrol Diesel Decreased: వాహనదారులకు మోడీ సర్కార్ బంపర్ ఆఫర్.. పెట్రోల్ డీజిల్ పై లీటరుకు రూ.15.33 తగ్గింపు..

Petrol Diesel Cut: వాహనదారులకు ఇటీవలె మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Written by - Renuka Godugu | Last Updated : Mar 17, 2024, 01:05 PM IST
Petrol Diesel Decreased: వాహనదారులకు మోడీ సర్కార్ బంపర్ ఆఫర్.. పెట్రోల్ డీజిల్ పై లీటరుకు రూ.15.33 తగ్గింపు..

Petrol Diesel Cut: వాహనదారులకు ఇటీవలె మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గిస్తూ కేంద్ర చమురు శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే, రాష్ట్రాలను బట్టి ఇంధన ధరల్లో వ్యత్యాసాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ దాదాపు రూ. 110 ఉండగా.. డీజిల్‌ కూడా దాదాపు అదే స్థాయిలో రూ.100 వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 తగ్గించిన విషయం తెలిసిందే.

అయితే, తాజాగా మోడీ సర్కార్ మరో ప్రకటన చేసింది. దేశ కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేసింది. మోడీ సర్కార్ లక్షద్వీప్‌ను అభివృద్ధి చేయడానికి తీవ్ర కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా లక్షద్వీప్‌ను సందర్శించి బీచ్‌ వద్ద ఫోటోలు దిగడం వంటివి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మల్‌దీవ్స్ చిచ్చు కూడా అప్పటి నుంచే ముదిరిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఉన్న మినికాయ్, కవరత్తి ద్వీపంలో డీజీల్ పై రూ. 5.20 తగ్గించింది. అండ్రోట్ కల్ఫేనీ ఐలాండ్లో డీజిల్‌పై రూ.15.33, పెట్రోల్‌పై రూ.15.38 వరకు తగ్గించింది. ఈ ధరలు శనివారం నుంచే అమలయ్యాయి. ఈ ప్రాంతంలోనే ఈ భారీ తగ్గింపు అమలు కానుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ తగ్గింపును ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ ధరల సవరణ తరువాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తే ఇలా ఉన్నాయి... హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.2.25 తగ్గి రూ. 107.41 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.2.17 తగ్గి రూ. 95.65 వద్దకు చేరుకుంది. 

ఇదీ చదవండి:  సెబీ రిక్రూట్మెంట్‌ 2024.. రూ. 90,000 జీతంతో ఉద్యోగం.. ఇలా అప్లై చేసుకోండి..

ఇదిలా ఉండగా చివరిసారి మన దేశంలో ఇంధనరేట్లు 2022 మే నెల ముందు వరకు మారాయి. అప్పట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు బ్యారెల్‌కు 140 డాలర్ల వద్ద ఉండేవి. ప్రస్తతం ముడి చమురు ధరలు 80 డాలర్ల వద్ద ఉంది.తాజాగా తగ్గించిన ఇంధన ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ధరల తగ్గింపు ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ తాయిలం ప్రకటించిందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తగ్గిన ధరలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. 

ఇదీ చదవండి:  ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News