HIV Infections: హెచ్ఐవీ విధ్వంసం.. 828 కి పాజిటివ్, 47 మంది మృతి.. ఎక్కడో తెలుసా..?

Tripura hiv issue: త్రిపురలో ఎయిడ్స్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే త్రిపురలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అనేక మంది విద్యార్థులు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులు హెచ్‌ఐవి పాజిటివ్‌ గా తెలింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jul 10, 2024, 04:00 PM IST
  • త్రిపురలో హెచ్ఐవీ కలకలం..
  • ఆందోళనలో తల్లిదండ్రులు..
HIV Infections: హెచ్ఐవీ విధ్వంసం.. 828 కి  పాజిటివ్, 47 మంది మృతి.. ఎక్కడో తెలుసా..?

HIV Infections in Tripura state: దేశంలోని త్రిపుర రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) అధికారులు వెల్లడించిన ప్రకారం, త్రిపురలో చాలా మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. త్రిపురలో హెచ్‌ఐవీ కారణంగా 47 మంది విద్యార్థులు మరణించారని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్) సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాకుండా.. 828 మంది విద్యార్థులు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. వీరిలో 47 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోనలు వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more: Viral video: ముంబైలో వర్షం బీభత్సం... రైలు పట్టాలపై తిరుగుతున్న చేపలు.. వీడియో వైరల్..

త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రకారం.. 220 పాఠశాలలు, 24 కళాశాలలు, కొన్ని విశ్వవిద్యాలయాల నుండి ఇంజక్షన్ ద్వారా డ్రగ్స్ సేవించే విద్యార్థులు ఉన్నట్లు  గుర్తించారు. ఇప్పటి వరకు కూడా.. హెచ్ఐవీ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. క్రియాశీల కేసుల సంఖ్య 8,729 అని టీఎస్‌సీఎస్‌ అధికారి తెలిపారు. వీరిలో 5,674 మందికి వ్యాధిసోకినట్లు తెలుస్తోంది.

దీనిలో.. 4,570 మంది పురుషులు, 1,103 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఐవీ సోకిన వారిలో కలుషితమైన సూదులనుఉపయోగించం వల్ల వ్యాప్తిచెందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై త్రిపుర సర్కారు కూడా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.  మరోవైపు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

HIV వ్యాప్తిచెందడానికి కారణాలివే..

హెచ్ఐవీ వ్యాప్తి చెందడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెఫ్టీ లేని సెక్స్, కలుషితమైన సూదులు లేదా సిరంజిల వాడకం లేదా వ్యాధి సోకిన వ్యక్తి రక్తం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించడం కారణాలుగా చెప్పుకోవచ్చు. హెచ్‌ఐవీ కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా ఇతర అంటు వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది.

HIV సోకితే లక్షణాలు:

ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఎలాంటి సింప్టమ్స్ కనిపించవు. అయితే, ఒక వారం నుండి మూడు నెలల మధ్య, జ్వరం, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు సోకిన వ్యక్తిలో కనిపిస్తాయి. ఇది జరిగితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ చేయించుకోవాలి.

దీని వల్ల హెచ్ఐవీ రాదు..

వ్యాధి సోకిన వ్యక్తితో కరచాలనం చేయడం, అతనితో ప్రయాణించడం, ఒకే ప్లేట్‌లో ఫుడ్ తినడం, అదే గ్లాస్‌ లోని నీరు తాగడం, అతనితో ఆడుకోవడం, కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా ఇది వ్యాపించదు. అయితే దోమలు లేదా కీటకాలు వ్యాప్తి చెందవు. అలాగే గాలి లేదా ఒకరు ఉపయోగించిన నీటిని మరోకరు ఉపయోగిస్తే మాత్రం వ్యాప్తిచెందదు.

Readmore: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..

HIVని ఇలా అరికట్టవచ్చు..

HIV సంక్రమణను నివారించడానికి టీకా లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గమనిచెప్పుకోవచ్చు. మీరు కొన్ని చర్యలను అనుసరించడం ద్వారా మిమ్మల్ని, ఇతరులను ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News