/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Remdesivir Injections: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ సిలెండర్ల కొరత మరోవైపు కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ ఫార్మా కంపెనీ నుంచి 60 వేల రెమ్‌డెసివిర్ వయల్స్ విదేశాలకు తరలించడం అనుమానాలకు తావిస్తోంది.

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు( India corona cases) అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్(Remdesivir Injection)‌కు డిమాండ్‌ అదేస్థాయిలో పెరుగుతోంది. కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్ కొరత వేధిస్తోంది. కొరత నేపథ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం (Central government Ban on remdesivir exports) నిషేధం విధించింది. అయితే, డామన్‌కు చెందిన బ్రూక్‌ ఫార్మాస్యూటికల్‌( Bruck pharma) కంపెనీ 60 వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ను ఎయిర్‌ కార్గో ద్వారా విదేశాలకు తరలించినట్లు మంబై పోలీసులు గుర్తించారు.

దాంతో సంస్థ డైరెక్టర్‌ రాజేశ్‌ డొకానియాను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం రాజేశ్‌ డొకానియా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్లారు. బ్రూక్‌ ఫార్మా సంస్థ రెమిడెసివిర్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. భారీ సంఖ్యలో వయల్స్‌ను విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బ్రూక్‌ ఫార్మా డైరెక్టర్‌ను పోలీసులు ప్రశ్నించడంపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ(Bjp) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిని అధికార శివసేన–కాంగ్రెస్‌–ఎన్సీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించింది. రాజేశ్‌ డొకానియాను తరలించిన పోలీసు స్టేషన్‌కు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fudnavis) ‌తోపాటు బీజేపీ నేతలు చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. బ్రూక్‌ ఫార్మా కంపెనీతో మాట్లాడి, మహారాష్ట్రకు రెమిడెసివిర్‌ ఇంజక్షన్ ( Remdesivir injections)లు ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శించారు. బ్రూక్‌ ఫార్మా సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి అత్యవసరమైన ఇంజక్షన్‌లను విదేశాలకు అక్రమంగా తరలించిన ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారిస్తుంటే... బీజేపీకి అభ్యంతరం ఎందుకో చెప్పాలని కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ నిలదీశాయి. 

Also read: Delhi Lockdown: ఢిల్లీలో కనీసం 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలా, కేజ్రీవాల్ నిర్ణయమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Mumbai police probing pharma company for exporting remdesivir vials to other countries
News Source: 
Home Title: 

Remdesivir Injections: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విదేశాలకు సరఫరా, విచారిస్తు

Remdesivir Injections: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విదేశాలకు సరఫరా, విచారిస్తున్న పోలీసులు
Caption: 
Bruck pharma ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Remdesivir Injections: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విదేశాలకు సరఫరా, విచారిస్తు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, April 19, 2021 - 09:34
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
69
Is Breaking News: 
No