Nandigram: నందిగ్రామ్..కేంద్ర బలగాల మయం, రేపే పోలింగ్

Nandigram: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ అందర్నీ ఆకర్షిస్తోంది. నిన్నటి వరకూ కుడిభుజంగా ఉన్నవాడే..ఇప్పుడు దీదీతో తలపడుతున్నాడు. మమతా వర్సెస్ సుబేందు పోటీలో నందిగ్రామ్‌ను రక్షణ వలయంలో బిగిస్తున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2021, 04:42 PM IST
Nandigram: నందిగ్రామ్..కేంద్ర బలగాల మయం, రేపే పోలింగ్

Nandigram: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ అందర్నీ ఆకర్షిస్తోంది. నిన్నటి వరకూ కుడిభుజంగా ఉన్నవాడే..ఇప్పుడు దీదీతో తలపడుతున్నాడు. మమతా వర్సెస్ సుబేందు పోటీలో నందిగ్రామ్‌ను రక్షణ వలయంలో బిగిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో(West Bengal Elections)నందిగ్రామ్ చరిత్ర కీలకం. దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ మమతా బెనర్జీని అధికారంలో కూర్చోబెట్టిన నియోజకవర్గం నందిగ్రామ్. 14 ఏళ్ల అనంతరం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ రెండవ దశ పోలింగ్‌లో నందిగ్రామ్ కీలకంగా ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) వర్సెస్ నిన్నటి వరకూ ఆమె కుడి భుజమైన సుబేందు పోటీ పడుతుండటంతో టెన్షన్ నెలకొంది. ఈ నేపధ్యంలో భారీగా కేంద్ర బలగాలతో నందిగ్రామ్‌ను ముంచెత్తనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ పోలింగ్ నాడు నందిగ్రామ్ మొత్తం కేంద్ర బలగాల మయం కానుంది. 

ఏప్రిల్ 1న పోలింగ్ నాడు నందిగ్రామ్(Nandigram)‌లో పెద్దఎత్తున కేంద్ర బలగాల్ని మొహరించనున్నారు. 22 క్యూఆర్ టీమ్స్ అంటే అత్యవసరంగా స్పందించే టీమ్‌లను నందిగ్రామ్‌లో మొహరించబోతున్నారు. పోలింగ్ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్నికల కమీషన్ (Election Commission)తెలిపింది. కేంద్ర బలగాల్లో వంద మంది సిబ్బంది ఉంటారు. అదనంగా కోల్‌కత్తాలోని ఛీఫ్ ఎలక్టోరల్ ఆపీసర్ కార్యాలయంలో సైతం ఓ ప్రత్యేక బృందం నందిగ్రామ్ పరిస్థితిని పర్యవేక్షించనుంది.

నందిగ్రామ్‌లో మొత్తం 355 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. వీటిలో 75 శాతం కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ నిరంతరం పర్యవేక్షించే వీలుంటుంది.  నందిగ్రామ్‌లో ఎక్కడా హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ఘంగా పోలింగ్ జరపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పోలీస్ కమీషనర్ తెలిపారు. 

Also read: Your take home salary: ఉద్యోగులకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

స్తుతానికి లేనట్టేనా ?

Trending News