NEET 2024 Precautions: దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ 2024 పరీక్ష మరి కాస్సేపట్లోప్రారంభం కానుంది. ఇవాళ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
ఇవాళ మే 5న జరగనున్న నీట్ 2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల 833 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. నీట్ పరీక్ష అర్హత, ర్యాంకు ఆధారంగా వివిధ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశముంటుంది. మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5 గంటల 20 నిమిషాలవరకూ పరీక్ష ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. అందుకే కనీసం అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సిద్ధమవాలి. దూర ప్రాంతాల్నించి వచ్చే విద్యార్ధుల సౌకర్యార్ధం ఉదయం 11.30 గంటల్నించే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
నీట్ పరీక్షకు అడ్మిట్ కార్డుతో పాటుగా ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ ఫోటో తీసుకెళ్లాలి. సాధారణ చెప్పులు మాత్రమే ధరించాలి. షూస్, పొడుగు చేతుల దుస్తులు, ఆభరణాలు ధరించకూడదు. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. విద్యార్ధినిలు మెహిందీ కూడా పెట్టుకోకూడదు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమేరాలతో నిఘా ఉంటుంది. సెల్ ఫోన్లు పనిచేయకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేశారు.
Also read: Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook