గోవా: జీఎస్‌టీ మీటింగ్‌కు ముందు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ టాక్స్ చట్టంలోని నిబంధనల్లో మార్పుకు శ్రీకారం చుట్టింది. దేశీయ సంస్థలకు కార్పోరేట్ పన్ను శాతం తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్పోరేట్ పన్ను శాతం 34.94 ( సర్ ఛార్జ్, సెజ్ తో కలిపి ) నుంచి 25.17కి తగ్గించారు. గోవాలో ప్రెస్ మీట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ మందగమనంలో ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్థను పునురుద్దీంచే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వృధి రేటు పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. కంపెనీల ఆదాయం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశీయ కంపెనీలకు కార్పోరేట్ పన్ను 30 శాతం వసూలు చేస్తున్నారు. సెస్ తో కలిపి పన్ను 34.94 శాతంగా ఉంది. తాజాగా నిబంధనల ప్రకారం దేశీయ కంపెనీలకు కార్పోరేట్ టాక్స్ 22 శాతం ఉంటుంది. ఓవర్ ఆల్ గా చూస్తే (సర్ ఛార్జ్, సెజ్ తో కలిపి ) 25.17 శాతంగా ఉండనుంది. అంతే కాకుండా 22 శాతం పన్ను శాతం శ్లాబులో ఉన్న వారు..ప్రత్యామ్నాయ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మోడీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో కేంద్రానికి వార్షికంగా రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గనుందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా కొత్త ట్యాక్స్ రూల్ ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది.