Assembly Elections Results 2023 Updates; Tripura, Nagaland and Meghalayas Vote Counting started: ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఈరోజు (మార్చి 2) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలోని 12 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మేఘాలయలో ఎన్‌పీపీ 19 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. 5 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది.
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగాలాండ్, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవమయిన విషయం తెలిసిందే. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 4 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నేడు ఈ పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది. నాగాలాండ్‌లో 59 సీట్లకు 183 మంది పోటీపడ్డారు.
Counting of votes for Tripura, Nagaland & Meghalaya elections begins
Counting for by-elections for Lumla assembly seat of Arunachal Pradesh, Ramgarh (Jharkhand), Erode East (Tamil Nadu), Sagardighi (West Bengal) & Kasba Peth, Chinchwad assembly seats of Maharashtra also begins pic.twitter.com/mMlLV3ryfV
— ANI (@ANI) March 2, 2023
మేఘాలయలో 59 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ ఫలితాలు హంగ్ దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 259 మంది పోటీపడ్డారు. మూడు రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ 31 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ కలిసి బరిలో దిగాయి. టిప్రా మోతా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Meghalaya | Section 144 imposed in Eastern West Khasi Hills district by the District Magistrate pic.twitter.com/JY8t1wHCp9
— ANI (@ANI) March 2, 2023
Also Read: Holi 2023 Remedies: హోలీ రోజున ఈ పని తప్పక చేయండి.. ఏడాదంతా మీ ఇంట్లో శుఖసంతోషాలు! ఊహించని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.