'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు గజగజా వణికిపోతున్నాయి. ఎందుకంటే అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది.
భారత్ లోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందులో గోవా ఒకటి. భారత దేశంలో అతి చిన్న రాష్ట్రమైన గోవాలో ఇప్పటి వరకు కేవలం 7 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాదు పాజిటివ్ రోగుల్లో ఇప్పటి వరకు ఆరుగురు చికిత్స తీసుకుని.. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. మరో వ్యక్తి కూడా నేడే , రేపో డిశ్చార్జి కానున్నాడు. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లుగా వైద్యులు చెబుతున్నారు.
గోవాను ఉత్తర గోవా, దక్షిణ గోవాగా విభజిస్తే.. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులన్నీ ఉత్తర గోవాలోనే కనిపించాయి. దక్షిణ గోవాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. ఇప్పుడు గత రెండు వారాల నుంచి ఉత్తర గోవాలోనూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఉత్తర గోవాను కూడా కొద్ది రోజుల్లోనే గ్రీన్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉంది.
గోవాలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. జనతా కర్ఫ్యూ విధించిన తర్వాత పక్కాగా ప్రజలు బయట తిరగడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిషేధించారు. అంతే కాదు జనతా కర్ఫ్యూ మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా .. మరో మూడు రోజులు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజుల వరకు ప్రజలు నిత్యావసరాలైన పాలు, కూరగాయలు లాంటివి కూడా కొనుగోలు చేసేందుకు అనుమతించలేదు. లాక్ డౌన్ విధించిన తర్వాత ప్రభుత్వ సిబ్బందితోనే నిత్యావసరాలను ఇంటి ఇంటికి సరఫరా చేయించారు. దీంతో గోవాలో చాలా వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. అంతే కాదు.. కరోనా లక్షణాలుగా కనిపించిన వారికి పరీక్షలు నిర్వహించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గోవాలో ఎందుకలా..?