న్యూ ఢిల్లీ: రాయితీ లేని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.162.50 తగ్గిస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు దిగొచ్చాయి. సబ్సీడీ లేని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా తగ్గడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీని వదిలేసుకున్న వారితో పాటు సంవత్సరానికి 12కిపైగా సబ్సీడీ సిలిండర్లను వినియోగించే వారికి ఈ ధరల తగ్గుదల వర్తిస్తుంది. నిన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో రూ.744 పలికిన 14.2 కిలోల నాన్-సబ్సీడీ ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు ధరలు తగ్గిన అనంతరం రూ.581.50 పలకనుంది.
Also read : సొంతూరికి వెళ్లాలని 150 కిమీ నడిచాడు.. దగ్గర్లోకి రాగానే కుప్పకూలి కన్నుమూశాడు!
ప్రభుత్వరంగ చమురు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్లపై ఇంత భారీ స్థాయిలో ధరలు తగ్గడం ఇదే తొలిసారి. గతంలో 2019 జనవరిలో నాన్-సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ 150.50 మేర తగ్గింది. అంతకంటే భారీస్థాయిలో ధర తగ్గడం మాత్రం ఇదే మొదటిసారి.
Also read : Coronavirus పుట్టుకపై అమెరికా ఇంటెలీజెన్స్ కీలక ప్రకటన
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో మునుపెన్నడూ లేనివిధంగా చమురు వినియోగం భారీ స్థాయిలో పడిపోయింది. ఈ కారణంగానే చమురు ధరలు సైతం అంతే భారీ స్థాయిలో పడిపోయాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..