Nupur Sharma: దేశవ్యాప్తంగా నుపుర్ శర్మ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఉదయ్‌పూర్‌లో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు సైతం నుపుర్ శర్మపై సీరియస్ అయ్యింది. దేశానికి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యనిచ్చింది. తాజాగా ఆమెపై కోల్‌కతా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కేసులు నమోదు అయ్యాయి.
ఈక్రమంలోనే కోల్‌కతాలోనూ నుపుర్ శర్మపై ఫిర్యాదు రావడంతో పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా గత నెల 20న విచారణకు రావాలని నర్కేల్‌దంగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 25న కోల్‌కతా పీఎస్ నుంచి ఆమెకు సమన్లు అందాయి. ఐతే తనకు ప్రాణ హాని ఉందని విచారణకు దూరంగా ఉన్నారు. ఈక్రమంలోనే నుపుర్ శర్మపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ వివాదం ఇప్పట్లో సర్దుమనుగేలా కనిపించడం లేదు. నుపుర్ శర్మ సైతం అజ్ఞాతంలోకి వెళ్లారు. వివాదస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అన్నింటిని ఢిల్లీకి మార్చేలా చూడాలని ఇటీవల ఆమె..సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం..నుపుర్ శర్మపై మండిపడింది. దేశవ్యాప్తంగా విద్వేషాలకు కారణమయ్యారని సీరియర్ అయ్యింది. వెంటనే క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఐతే నుపుర్ శర్మ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Also read: Madhucon Company: రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో ఈడీ విచారణ..విలువైన ఆస్తుల జప్తు..!
Also read:టెస్టుల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బుమ్రా.. బ్రియాన్ లారా రికార్డు బద్దలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook