Madhucon Company: రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసులో ఈడీ విచారణ..విలువైన ఆస్తుల జప్తు..!

Madhucon Company: రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. మధుకాన్‌ కంపెనీకి చెందిన విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 2, 2022, 06:37 PM IST
  • రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసు
  • ఈడీ విచారణ వేగవంతం
  • విలువైన ఆస్తుల అటాచ్
Madhucon Company: రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసులో ఈడీ విచారణ..విలువైన ఆస్తుల జప్తు..!

Madhucon Company: రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. మధుకాన్‌ కంపెనీకి చెందిన విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రాంచీ జంషెడ్పూర్ రహదారి పేరిట బ్యాంకుల నుంచి మధుకాన్ గ్రూప్‌ రూ.10.30 కోట్ల రుణాలు పొంది దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్‌పై రంగంలోకి దిగిన ఈడీ..ఆరు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని గుర్తించారు.

ఈకంపెనీలన్నీ టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఈకేసులో రూ.96.21 కోట్ల విలువైన మధుకాన్ ఆస్తులను జప్తు చేశారు. హైదరాబాద్‌, బెంగాల్, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రూ.88.85 కోట్లు విలువైన భూములు గుర్తించారు. మధుకాన్ షేర్లు సహా రూ.7.36 కోట్ల చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. నామా నాగేశ్వరావు మధుకాన్‌ కంపెనీకు చెందిన 105 ఆస్తులను సీజ్‌ చేశారు.

ఇదే కేసులో 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2020 డిసెంబర్‌లో ఛార్జీషీట్ దాఖలు నమోదు అయ్యింది. రాంచి-జంషెడ్పూర్‌ మధ్య 4 లైన్ల హైవే ప్రాజెక్ట్‌ను 2011లో మధుకాన్‌ సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ప్రాజెక్టు పూర్తి చేయలేదన్న అభియోగాలు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. మధుకాన్ కంపెనీలో గతంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

గతేడాది జూన్‌లో జరిపిన సోదాల్లో రూ.34 లక్షల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మధుకాన్‌ సంస్థ ఛైర్మన్ నామా నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు జరిగాయి. హైవే నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ కన్సోషియం నుంచి రూ.1030 కోట్ల రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. తీసుకున్న రుణాన్ని ఆరు షెల్ కంపెనీలకు బదాలించినట్లు తేల్చారు. మధుకాన్ సంస్థకు సంబంధించిన భూములు హైదరాబాద్, వెస్ట్ బెంగాల్, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించారు.

Also read: PM Modi Tour: ఈనెల 4న ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని మోదీ..టూర్ షెడ్యూల్ ఇదే..!

Also read: Revanth Reddy: పోరు గడ్డపై అడుగు పెట్టే అర్హత మోదీకి లేదు..టీపీసీసీ రేవంత్‌రెడ్డి ధ్వజం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News