Trains cancelled In 2019: 3,000 పైగా రైళ్లు రద్దు: రైల్వే

సమాచార హక్కు చట్టం కింద ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే అధికారులు ఈ వివరణ ఇచ్చారు. 2014 నుంచి ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఇదే తొలిసారి. 

Last Updated : Feb 17, 2020, 09:16 PM IST
Trains cancelled In 2019: 3,000 పైగా రైళ్లు రద్దు: రైల్వే

న్యూఢిల్లీ: 2019లో దేశవ్యాప్తంగా మొత్తం 3,000కుపైగా రైళ్లు రద్దు చేసినట్టు భారతీయ రైల్వే స్పష్టంచేసింది. వివిధ మార్గాల్లో, వివిధ కారణాలతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతుల పనుల సందర్భంగా ఆయా రైళ్లను రద్దు చేసినట్టు ఇండియన్ రైల్వే తేల్చిచెప్పింది. సమాచార హక్కు చట్టం కింద ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే అధికారులు ఈ వివరణ ఇచ్చారు. 2014 నుంచి ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఇదే తొలిసారి అని చెబుతూ.. గతేడాది రైల్వే శాఖ చేపట్టిన అభివృద్ధి పనులకు ఇదే ఓ నిదర్శనం అని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

తరచుగా రైళ్ల రద్దుతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగినప్పటికీ... సమస్యాత్మక మార్గాల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం, రైల్వే మార్గాల అభివృద్ధి, మరమ్మతుల కోసం ఆ అసౌకర్యాన్ని భరించక తప్పదని సంబంధిత రైల్వే అధికారి పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News