Oyo Special Discount: రేపు డిఫెన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఓయో హోటల్స్‌లో 45 శాతం డిస్కౌంట్ ఆఫర్ 

Oyo Special Discount Offer: రేపు డిఫెన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు ప్రముఖ చైన్ హోటల్ నిర్వహణ సంస్థ ఓయో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఓయో హోటల్స్‌లో స్టే చేసేవారికి 45 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 3, 2022, 08:05 AM IST
  • రేపు డిఫెన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు గుడ్ న్యూస్
  • ఓయో హోటల్స్‌లో 45 శాతం తగ్గింపు
  • ఏయే నగరాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందంటే..
Oyo Special Discount: రేపు డిఫెన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఓయో హోటల్స్‌లో 45 శాతం డిస్కౌంట్ ఆఫర్ 

Oyo Special Discount Offer: ప్రముఖ హోటల్ చైన్ నిర్వహణ సంస్థ 'ఓయో' డిఫెన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం (సెప్టెంబర్ 4) జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఓయో హోటల్స్‌లో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ఆయా నగరాల్లోని ఓయో హోటల్స్‌లో డిఫెన్స్ అభ్యర్థులకు 45 శాతం డిస్కౌంట్ ఉంటుంది.

ఓయో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్.. ఏయే నగరాల్లో 

దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ఓయో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇందులో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గౌతమ్ బుద్ధ నగర్, గుర్గావ్, లక్నో, చండీగఢ్, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, లూథియానా, భువనేశ్వర్, పాట్నా, విశాఖపట్నం, వారణాసి, కోల్‌కతా, పుణే, డెహ్రాడూన్ నగరాలు ఉన్నాయి.

ఓయో డిస్కౌంట్ ఆఫర్ ఎలా పొందాలి :

మొదట గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓయో యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
మీరు పరీక్ష రాయబోయే నగరాన్ని ఎంచుకోండి
మీ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉండే హోటల్స్‌ను గుర్తించేందుకు 'నియర్ బై' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
కూపన్ కోడ్ 'NDACDS' సెలెక్ట్ చేయండి
చివరగా 'బుక్ నౌ' ఆప్షన్‌పై క్లిక్ చేసి డబ్బులు చెల్లించండి. కూపన్ కోడ్ అప్లై చేశారు కాబట్టి ఆటోమేటిగ్గా మీరు చెల్లించాల్సిన బిల్లులో 45 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.

డిఫెన్స్ అభ్యర్థులకు ఓయో హోటల్స్ అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాదాపుగా అన్ని ఓయో హోటల్స్‌లో వైఫై, ఏసీ తదితర సౌకర్యాలు ఉంటాయి. ఈ ఆఫర్‌పై ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శీరంగ్ మాట్లాడుతూ.. ఔత్సాహిక సైనిక అభ్యర్థులకు ఈ ఆఫర్ అందించడాన్ని తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని చెప్పారు. డిఫెన్స్ పరీక్ష కోసం వివిధ నగరాలకు ప్రయాణించే అభ్యర్థులు అక్కడ ఉండే ఓయో హోటల్స్‌లో ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.

కాగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతీ ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, మిలటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఉద్యోగాలను ఈ పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో రేపు ఈ పరీక్షలు జరగనున్నాయి.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు..

Also Read: Horoscope Today September 3rd 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారికి ఇవాళ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సంఘటనలు ఎదురవుతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News