Pan Card Link Alert: పాన్ కార్డు-ఆధార్ కార్డ్ లింక్ అనేది తప్పనిసరి. మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో అనుసంధానం చేయించనట్టయితే పాన్ కార్డు డీయాక్టివేట్ కాగలదు. అందుకే డిసెంబర్ 31 వరకూ మరోసారి గడువు పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరంగా మారుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు, ట్యాక్స్ పేయర్లు ఇలా అందరికీ ఇది తప్పనిసరిగా మారింది. పాన్ కార్డు లేకుంటే చాలా పనులు ఆగిపోయే పరిస్థితి. అదే సమయంలో మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో లింక్ చేయమని ఇన్‌కంటాక్స్ శాఖ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు డెడ్ లైన్ పొడిగించిన ఇన్‌కంటాక్స్ శాఖ ఇప్పుడు మరోసారి గడువు పెంచింది. డిసెంబర్ 31 లోగా విధిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 31 వరకూ పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం చేయకుంటే పాన్ కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. ఇప్పటికీ మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోయుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి.
ఇటీవలి కాలంలో ఆర్ధిక మోసాలు పెరిగిపోయాయి. చాలామంది పాన్ వివరాలతో అనధికారిక కస్టమర్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. అందుకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఫలితంగా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. అందుకే పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అయింది. డిసెంబర్ 31 వరకూ ఈ రెండూ లింక్ కాకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది. ఆ తరువాత ఆర్ధిక లావాదేవీలకు కష్టమౌతుంది.
పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు చెందిన ఇ ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందులో కన్పించే క్విక్ లింక్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లింక్ ఆధార్ స్టేటస్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్, పాన్ కార్డు నెంబర్ వివరాలు సమర్పించాలి. ఒకవేళ మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయుంటే Your Pan is Alreadty linked with the given Aadhaar అని వస్తుంది. ఒకవేళ కాకపోయింటే Pan is not linked with Aadhaar అని కన్పిస్తుంది. మీ పాన్ కార్డు ఇంకా లింక్ కాకుంటే లింక్ ఆదార్ క్లిక్ చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు క్షణాల్లో రెండింటి అనుసంధానం పూర్తవుతుంది.
పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అనేది 2023 జూన్ 30 వరకు ఉచితంగా ఉండేది, కానీ ఇప్పుడు ఫీజు చెల్లించాలి. మొన్నటి వరకూ 500 రూపాయలు ఉన్న ఫీజు కాస్తా ఇప్పుడు 1000 రూపాయలైంది. అంటే ఇప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయాలంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది.
Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకటనపై గుడ్‌న్యూస్, కనీస వేతనం ఎంత పెరగనుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.