Parents Move Court: సంతానం లేదని కొడుకు, కోడలును ₹ 5 కోట్లు పరిహారం కోరిన తల్లిదండ్రులు

Parents Move Court: ఉత్తరాఖండ్‌లోని వృద్ధ దంపతులు తమ కొడుకు..కోడలుపై కోర్టును ఆశ్రయించారు. మనవడు లేదా రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ దంపతులు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 08:17 PM IST
  • సంతానం లేదని కొడుకు, కోడలును ₹ 5 కోట్లు పరిహారం కోరిన తల్లిదండ్రులు
  • పరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
  • తమ కుమారుడికి 2016లో ఘనంగా వివాహం చేసిన ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ దంపతులు
Parents Move Court: సంతానం లేదని కొడుకు, కోడలును ₹ 5 కోట్లు పరిహారం కోరిన తల్లిదండ్రులు

 

Parents Move Court: సంవత్సరంలోగా పిల్లలను కనండి లేదా పరిహారంగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలని కోడలు, కుమారుడికి వృద్ధ దంపతులు అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు కోర్టు మెట్లు ఎక్కారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ దంపతులు తమ పుత్రుడికి 2016వ సంవత్సరంలో ఘనంగా వివాహం చేశారు. అయితే ఆ దంపతులు అగ్రరాజ్యం అమెరికాలో సంపాదన యావలో పడి ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు. మరోవైపు ఎస్‌ఆర్ ప్రసాద్‌ తన ఆస్తులను తన కుమారుడికి అప్పగించారు. అతడు లైఫ్‌లో స్థిరపడేందకు అమెరికాలో కోచింగ్‌ ఇప్పించాడు. దీంతో కొడుకు, కోడలు అమెరికాలో స్థిరపడ్డారు. ప్రసాద్‌ దంపతుల బాగోగులు వారి కుమారుడు పట్టించుకోవడం లేదని వాపోయారు.

సంజీవ్ ప్రసాద్..సాధనా ప్రసాద్ అనే జంట 2016లో వారి కుమారుడు శ్రేయ్ సాగర్‌ శుభాంగిని వివాహం చేసుకున్నారు. శ్రేయ్ సాగర్ పైలట్‌గా ఉండగా అతని భార్య నోయిడాలో పనిచేస్తోంది. వారిని హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు పంపారు కానీ మనవడు కావాలని అడిగిన ప్రతిసారీ మానసికంగా వేధింపులకు గురయ్యారు. తాము లింగభేదం గురించి పట్టించుకోలేదు, కేవలం మనవడు మాత్రమే కావాలని తండ్రి సంజీవ్ ప్రసాద్ అన్నారు. ఇంతలో, తల్లి సాధన ప్రసాద్, శ్రేయ్ సాగర్ తమకు ఏకైక కుమారుడని..అతని చిన్నప్పటి నుంచి అతని డిమాండ్లన్నింటినీ తాను నెరవేర్చానని చెప్పారు.

మరోవైపు ఎస్‌ఆర్ ప్రసాద్‌ దంపతులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఆస్తంతా కుమారుడికి ఇయ్యడంతో వృద్ధ దంపతుల వద్ద జీవనం కొనసాగించడానికి ఆస్తులు ఏమీ లేవు. దీంతో ఇంటిని నిర్మించుకునేందుకు బ్యాంక్‌లో రుణం తీసుకున్నారు. నెల నెల EMIలు చెల్లించేందుకు వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో కోర్టు తలుపులు తట్టారు వృద్ధ దంపతులు. తమ కుమారుడు, కోడలు సంవత్సరంలోగా ఒక బిడ్డను కనాలని అల్టిమేటం పెట్టారు. లేని పక్షంలో చెరో 2.5 కోట్ల రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలు పరిహారంగా ఇప్పించాలని కోర్టును కోరారు ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ దంపతులు.

ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ దంపతుల కేసు ప్రస్తుతం సమాజంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పడుతుందని వారి లాయర్‌ ఏకే శ్రీవాస్తవ వెల్లడించారు. పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుబడి పెడతారని..వారు ఉన్నత స్థానంలో ఉండేలా తీర్చిదిద్దేందుకు కష్టపడతారని చెప్పారు. ఈ సందర్భంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలను తీర్చే బాధ్యత పిల్లలపై ఉంటుందని లాయర్‌ శ్రీవాస్తవ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌ దంపతుల కుమారుడు, కోడలను గ్రాండ్‌ చిల్డ్రన్‌..లేని పక్షంలో 5 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని అల్టిమేటం ఇచ్చారని ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ దంపతుల తరఫు లాయర్‌ శ్రీవాస్తవ అన్నారు.

Also Read: Manglik Dosh: మాంగ్లిక్ దోషం వల్ల పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయా? రత్నాన్ని ధరించి సమస్యల నుంచి విముక్తి పొందండి

Also Read: Maa Lakshmi Blessings: మే 12న లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటే ఏడాదంతా డబ్బులే..డబ్బులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News